ETV Bharat / state

కార్మికులకు వైకల్యం కలిగితే ఉచితంగా రూ.5 లక్షలు - ప్రభుత్వం అందించే ఈ సాయం మీకు తెలుసా? - DISABILITY RELIEF SCHEME

కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రమాదంలో వైకల్యం ఏర్పడితే గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తోంది.

Disability Relief Scheme for Workers
Disability Relief Scheme (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 3:01 PM IST

Disability Relief Scheme for Workers : కార్మిక సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. ఆ స్కీమ్స్​ కింద పలు రకాల ప్రయోజనాలను కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే.. తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో "డిసేబిలిటీ రిలీఫ్​ స్కీమ్​ని" అమలు చేస్తున్నారు.

ఈ పథకం ద్వారా పని ప్రదేశంలో జరిగిన ప్రమాదం కారణంగా కార్మికుడికి శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం, అదే.. పాక్షిక వైకల్యానికి రూ.4 లక్షల వరకు రిలీఫ్ ఫండ్​ అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Government). మరి.. ఇందుకు కావాల్సిన అర్హతలు ఏంటి? ఏ ఏ పత్రాలు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అర్హతలు :

  • ఆర్థిక సాయం పొందాలనుకుంటున్న బాధిత కార్మికుడు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యుడై ఉండాలి. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు జారీ చేసే గుర్తింపు కార్డు(Labour Card) కలిగి ఉండాలన్నమాట.
  • పనిచేస్తున్న ప్రదేశంలో ప్రమాదం కారణంగా వైకల్యం సంభవించి ఉండాలి.

దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు :

  • దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
  • ఆధార్ కార్డ్(Aadhaar)
  • బాధిత కార్మికుడి రిజిస్ట్రేషన్ కార్డ్(ఒరిజినల్)
  • రెన్యూవల్ చలాన్ కాపీ
  • డిసేబిలిటీ సర్టిఫికెట్(అధికారులు జారీ చేసినది)
  • FIR కాపీ (పోలీస్ కేసు నమోదైతే)
  • అడ్వాన్స్ స్టాంపెడ్ రశీదు
  • బ్యాంక్ పాస్‌బుక్ కాపీ

చాలామందికి తెలియదు - కార్మికుడు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం!

దరఖాస్తు విధానం :

  • ప్రమాదంలో శాశ్వత లేదా పాక్షిక వైకల్యం పొందిన కార్మికుడు ఈ స్కీమ్ కింద లబ్ది పొందాలంటే ఆఫ్​లైన్​ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు ముందుగా డిసేబిలిటీ స్కీమ్​కి సంబంధించిన అప్లికేషన్​ ఫామ్​ని పొందాలి.
  • అందుకోసం సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించి అప్లికేషన్ ఫామ్​ని పొందవచ్చు. లేదంటే.. కార్మిక శాఖ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి కూడా ఇందుకు సంబంధించిన ఫామ్​ని డౌన్​లోడ్ చేసుకోవచ్చు.
  • డిసేబిలిటీ ఫామ్​ని పొందాక అందులో పేర్కొన్న వివరాలన్నీ కరెక్ట్​గా నమోదు చేయాలి. తర్వాత అవసరమైన పత్రాల కాపీలను అప్లికేషన్​ ఫామ్​కి జత చేయాలి.
  • అనంతరం ఫామ్​పై సంతకం చేసి కార్మిక శాఖలోని సంబంధిత అధికారికి అందజేయాలి.
  • అప్లికేషన్ ఇచ్చాక దరఖాస్తు చేసినట్టుగా మీరు అధికారి వద్ద నుంచి రిసిప్ట్ తీసుకోవాలి.
  • అలాగే రిసిప్ట్​పై సమర్పించిన తేదీ, సమయంతో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. అని ఓసారి పరిశీలించుకోవాలి.
  • మీ దరఖాస్తు తర్వాత.. అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి తగ్గని ప్రభుత్వ అధికారి దానిపై విచారణ జరుపుతారు.
  • అప్పుడు ప్రమాదవశాత్తుగానే శాశ్వత లేదా పాక్షిక వైకల్యం సంభవించినట్లు నిర్ధరణ జరిగితే.. నేరుగా బాధిత కార్మికుడి బ్యాంక్ అకౌంట్​లో ఆర్థిక సాయం జమ అవుతుంది!

ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.6 లక్షల సాయం - ఈ స్కీమ్ గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.