Diputy Cm Bhatti Vikramarka Review on Budget Proposals : బడ్జెట్ ప్రతిపాదనలపై వివిధ శాఖలతో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు కొనసాగుతున్నాయి. ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులతో భట్టి సమీక్ష చేశారు. ఆయా శాఖల పని తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు, ఈ సంవత్సరంలో చేపట్టే కార్యకలాపాలకు కావాల్సిన నిధులపై నివేదిక అందించారు. పరిశ్రమల వ్యాప్తి జరుగుతున్నందున అవి తయారు చేసే వస్తువుల ఎగుమతి పెంచేందుకు వీలుగా డ్రైపోర్టుల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.
Minister Bhatti Vikramarka Review on Finance Department : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పరిశ్రమల భూకేటాయింపులపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం రైతుల నుంచి సేకరిస్తున్న భూమికి సముచిత పరిహారం అందిస్తామని పునరుద్ఘాటించారు. లెదర్ పార్క్‌ల ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రీజినల్ రింగ్‌రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుతో రోడ్ కనెక్టివిటీ పెరిగి, రవాణా సమస్య లేకుండా ఉండటంతో పాటు ఆ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కులో పారిశ్రామికవేత్తలకు చేసే భూకేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రాధాన్యమివ్వాలని భట్టి విక్రమార్క సూచించారు.
'వేసవిపై దృష్టి సారించండి, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలను పెంచాలి'
Minister Bhatti Vikramarka On Power : బీఆర్ఎస్కు చెందిన కొంతమంది సోషల్‌మీడియా వీరులు, కరెంటు సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్‌తో పాటు ఎలాంటి కోతలు లేకుండా నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలుకంటున్న బీఆర్ఎస్ సోషల్‌మీడియా వీరుల ఆశలు, అసలు స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఫిబ్రవరి నుంచి విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు చర్యలు చేపట్టామన్న భట్టి విక్రమార్క, రానున‌్న రోజుల్లో సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తుగా మెయింటనెన్స్ పనులు చేపట్టినట్లు చెప్పారు.
Bhatti Vikramarka Fires on BRS : గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పన పెంచేందుకు నూతన చిన్న, మధ్య తరహా పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. దావోస్ పర్యటనలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ పాలసీపై ఆరా తీశారని, అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ ఆర్థిక స్వావలంబన తీసుకొస్తుందని వివరించారు.
Diputy Cm Bhatti Vikramarka Review Meetings : 9 జిల్లాల్లో నూతనంగా ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు శ్రీధర్‌బాబు చెప్పారు. పరిశ్రమలకు బడ్జెట్‌లో సముచితంగా నిధులు కేటాయిస్తూ 75 శాతానికి పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించబోతున్నామని, ఇప్పటికే ఫైబర్ కేబుల్ పనులు 90 శాతం పూర్తైనట్లు చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల ఉపయోగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాల్లో ఏర్పాటవుతున్న ఐటీ హబ్‌లలో కంపెనీలు ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామని శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు.