ETV Bharat / state

'ధరణి' నయా మార్గదర్శకాలు - పూర్తి అధికారం వాళ్ల చేతిలోనే !

Dharani Portal News latest Telangana : తెలంగాణ రాష్ట్ర సర్కారు తాజాగా ధరణి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పోర్టల్‌లోని సమస్యలు, వాటి పరిష్కారానికి సంబంధించి అధికారాలను బదిలీ చేసింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు అధికారాల బదిలీ ప్రక్రియను చేపట్టింది. మరోవైపు మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు ధరణి సమస్యలపై ప్రత్యేక డ్రైవ్​ను నిర్వహించనున్నారు.

dharani_portal_news_latest_telangana
dharani_portal_news_latest_telangana
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 6:13 PM IST

Dharani Portal News latest Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ (Dharani Portal Scheme) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై ఇప్పటికే కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ధరణి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పోర్టల్ సమస్యల పరిష్కారానికి అధికారాలను బదలాయించింది.

ధరణి పోర్టల్‌ నుంచి.. ఈసీని డౌన్​లోడ్ చేసుకోవడం చాలా ఈజీ..

Dharani Portal powers Transfer : ఇప్పటి వరకూ జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్న ధరణి పోర్టల్ అధికారాలు ఇప్పుడు తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief secretary) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో ఈ మార్గదర్శకాల్లో రాష్ట్ర సర్కార్ వెల్లడించింది.

"ధరణి" పోర్టల్ ఎలా పనిచేస్తుంది? రైతులకు ఎలా ఉపయోగపడుతుంది..?

ధరణి పోర్టల్​లోని సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ : 17 రకాల మాడ్యుల్స్​కు సంబంధించి సవరింపుల కోసం వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 2.45 లక్షలకు చేరుకుంది. ధరణి పోర్టల్​లో సవరింపుల కోసం పెండింగ్​లో ఉన్న దరఖాస్తుల సంఖ్య 2,45,037గా ఉంది. పట్టాదారు పాస్​పుస్తకాల్లో డేటా కరెక్షన్​ కోసం లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. రికార్డుల అప్​డేషన్​ పేరుతో నిషేధిత జాబితా పార్ట్​ - బిలో 13.38 లక్షల ఎకరాలు ఉన్నాయి. అలాగే ఎలాంటి కారణాలు లేకుండా నిషేధిత జాబితాలో 5.07 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్చి 1 నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్ (Dharani Special Drive)​ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

తెలంగాణ ధరణి సమస్యలు త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు

ధరణి! వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు హక్కులు కల్పించేలా గత ప్రభుత్వం ఈ పోర్టల్‌ తీసుకొచ్చింది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలు సహా పారదర్శకత, జవాబుదారీతనంతో సేవలందించాలనేది ఈ పోర్టల్‌ ఉద్దేశం. కానీ, నిర్వహణలో అనేక లోపాలు బహిర్గతమయ్యాయి. మాడ్యుళ్లపై అవగాహన లేమి, ఆపరేటర్ల తప్పిదాలు, పర్యవేక్షణ కొరవడడం తదితర కారణాలతో ఎంతోమంది భూయజమానులు అవస్థలు పడ్డారు. కనీసం ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.

ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌పార్టీ ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకొచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మెనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులేస్తున్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సర్కారు ముందుగా భూసమస్యల అధ్యయనానికి ధరణి పేరిట కమిటీ వేసింది. ఈ కమిటీ వివిధశాఖల అధికారులతో అనేక సమావేశాలు నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ధరణి కమిటీ గుర్తించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.