ETV Bharat / state

ఒక్కరోజు పూజించినా వెయ్యేళ్ల ఫలం - తిరుమలలో సుప్రభాతం బదులు ఏకాంతసేవ - DHANURMASAM SPECIAL

రేపటి నుంచి ధనుర్మాసం - 30రోజుల పాటు తిరుప్పావై పాశురాలు

dhanurmasam_special
dhanurmasam_special (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2024, 4:09 PM IST

DHANURMASAM Special : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. స్వామివారికి ప్రతినిత్యం నిర్వహించే సుప్రభాతం బదులు ధనుర్మాసంలో నెల రోజులు మాత్రం తిరుప్పావై నివేదిస్తారు. మంగళవారం వేకువ జామున నుంచి ప్రారంభమై తిరుప్పావై నివేదన జనవరి 14 వరకు జరగనుంది. ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను రోజుకు ఒకటి చొప్పున 30 రోజులపాటు నివేదిస్తారు. ధనుర్మాసంలో భోగశ్రీనివాసమూర్తికి బదులు శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవను నిర్వహిస్తారు.

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. అందుకే ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దైవ ప్రార్థన‌కు అనుకూలం, తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటి వాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు నిర్వహించరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో అంతరార్థం.

తిరుమల కొండల్లో "పాలధారలు'' - మైమరచిపోతున్న భక్తులు

కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌ (గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని స్థుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం.

తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒక పాశురాన్ని అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా నిర్వహిస్తారు.

శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే సుఖ సంతోషాలు ఒనగూరుతాయని తెలియజేశారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్యగల కాలాన్ని ధనుర్మాసం అంటారు. పాపకర్మలను నశింప చేసి మోక్ష సాధన కోసం చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు.

తిరుమల లడ్డూ తయారు చేయాలనుకుంటున్నారా? - చర్యలు తప్పవుగా!

ప్రైవేటు ట్రావెల్స్ బస్​ డ్రైవర్ దాష్టీకం - అయ్యప్ప భక్తుల బ్యాగులు పడేసి ఉడాయించిన వైనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.