ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు - అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు - Devi Navaratri Celebrations Day 3 - DEVI NAVARATRI CELEBRATIONS DAY 3

శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు - అనేక కానుకలు సమర్పిస్తున్న భక్తులు

third_day_sharan_navaratri_celebrations_on_indrakeeladri
third_day_sharan_navaratri_celebrations_on_indrakeeladri (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2024, 4:35 PM IST

Third Day Sharan Navaratri Celebrations on Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల చరాచర సృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో ఆది పరాశక్తిని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, వాక్‌సిద్ధి, శుద్ధి కలుగుతాయి.

మానవుడ్ని సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. అమ్మ ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్తపోషణా భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది. అమ్మవారి దర్శనార్థం సాధారణ భక్తులతో పాటు ఉండి శాసనసభ్యులు కె. రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. అంతరాలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దసరా ఉత్సవాలకు అశేషంగా తరలివచ్చే భక్తులకు మంచి సదుపాయాలు కల్పించారని ఆర్‌ఆర్‌ఆర్‌ కోరారు. హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయాధికారులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఈ నెల 12 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.

Devi Navaratri Celebrations Day 3 at Vijayawada Durga Temple Indrakeeladri : భక్తులకు కొంగు బంగారంగా అనుగ్రహిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మకు శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తులు అనేక కానుకలను సమర్పిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత రెండు రోజులుగా మూలవిగ్రహానికి భక్తులు సమర్పించిన వజ్రాల కిరీటం, సూర్యచంద్రాలను అలకరించారు. ఇవాళ గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు సుమారు ఆరున్నర కేజీలకుపైగా వెండితో చేసిన హంస వాహనాన్ని అమ్మవారికి కానుకగా బహుకరించారు.

ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన కల్లగుంట అంకులయ్య అనే మరో భక్తులు సుమారు రూ. 18 లక్షల విలువైన బంగారు మంగళ సూత్రాన్ని సమర్పించారు. ఈ కానుకలను ఆలయ ఈవో కె.ఎస్‌. రామరావుకు అందజేశారు. అమ్మవారికి భక్తితో కానుకలు సమర్పించిన భక్తులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని పండితులు ఆశీర్వచనం పలికారు. దాతలకు దర్శన అనంతరం శేష వస్త్రంతో పాటు, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. భక్తుల కిటకిటలతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.