ETV Bharat / state

స్వరాష్ట్రంలో రూపురేఖలు మార్చుకున్న భాగ్యనగరం - హైదరాబాద్ సిగలో కీర్తి కిరీటాలెన్నో - Telangana Formation Day 2024 - TELANGANA FORMATION DAY 2024

Decade Celebrations of Telangana State 2024 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచింది. ఈ కాలంలో హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయి. సాగర తీరంలో పర్యాటక సొబగులు జతచేరాయి. మరోవైపు కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో విశ్వనగరికి బాటలు వేశాయి.

Telangana Formation Day 2024
Telangana Formation Day 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 10:30 AM IST

Updated : Jun 1, 2024, 10:51 AM IST

Telangana Formation Day 2024 : ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డ హైదరాబాద్‌. స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. 400ల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భాగ్యనగరి అభివృద్ధిలో దశాబ్దకాలం పెద్దది కాకపోయినా, ఈ పది సంవత్సరాల్లో చారిత్రక నగరికి మరిన్ని సొబగులు జతకూరాయి. విశ్వనగరికి అడుగులు పడ్డాయి.

మెట్రో పరుగులు : 2017 నవంబర్ 30 నుంచి అధునాతన ప్రజారవాణా మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మెట్రో పనులు మొదలెట్టినా, తెలంగాణ వచ్చాకే పూర్తయ్యింది. 69.2 కిలో మీటర్ల మార్గంలో నిత్యం 5 లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. పది సంవత్సరాల వ్యవధిలో ఒక్క కిలోమీటరు కూడా విస్తరణ చేపట్టకపోవడం, పాతబస్తీ మెట్రోని అటకెక్కించడం హైదరాబాద్‌ వాసులను నిరుత్సాహపర్చింది.

నిరంతర విద్యుత్ : ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో కరెంట్ కొరత కారణంగా పరిశ్రమలకు కొన్నిరోజులు పవర్‌ హాలిడే ఇచ్చేవారు. గృహాలకు కోతలు ఉండేవి. తెలంగాణ ఏర్పాటు అనంతరం కొద్దినెలల్లోనే కోతలను పూర్తిగా ఎత్తివేశారు. విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతర కరెంట్‌ సరఫరాతో ప్రజల జీవన ప్రమాణాలు, వ్యాపారాలు మెరుగుపడ్డాయి. ప్రజల బాధలు తీరాయి.

Telangana Formation Day 2024
అమరవీరుల స్మారకం (ETV Bharat)

పర్యాటక ఆకర్షణగా భవనాలు : పది సంవత్సరాల్లో హైదరాబాద్‌లో పలు ఐకానిక్‌ భవనాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోతగ్గది హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిర్మించిన నూతన సెక్రటేరియట్‌ భవనం. ఇప్పుడిది పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ భవనం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకం మరో ఆకర్షణ. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్ఫూర్తి ప్రజ్వరిల్లేలా దీన్ని రూపొందించారు. పక్కనే ఉన్న ఎన్టీఆర్‌ మార్గ్‌లో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. మరో ఐకానిక్‌ భవనం పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.

Telangana Formation Day 2024
125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం (ETV Bharat)

ఆ సమస్యలకు లభించని పరిష్కారం : ప్రత్యేక తెలంగాణ వస్తే దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంతా ఆశించారు. హైదరాబాద్‌లో వర్షం పడితే చాలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు పెరిగాయి. వీటికి పూర్తిస్థాయిలో పరిష్కారం లభించలేదు. రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారాలు చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Telangana Formation Day 2024
పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ETV Bharat)

కొత్త జిల్లాగా మేడ్చల్‌ : రాజధాని అంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కలగలిసి ఉండేవి. తెలంగాణ రాష్ట్రం అనంతరం రంగారెడ్డి జిల్లా ఉత్తర భాగాన్ని విడదీసి కొత్తగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాగా ఏర్పాటు చేశారు.

  • హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే సైబరాబాద్‌లో కొంతభాగం విడదీసి రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటు చేశారు.
  • శివారులో మున్సిపాలిటీలు, పంచాయతీలను కలిపి కొత్తగా మరో 7 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట కార్పొరేషన్లు కాగా, మేడ్చల్‌ జిల్లాలో నిజాంపేట బోడుప్పల్, పిర్జాదీగూడ, జవహర్‌నగర్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
  • రంగారెడ్డి జిల్లాలో 12 పురపాలక సంఘాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్‌ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి.
Telangana Formation Day 2024
ట్యాంక్‌బండ్‌పై శుక్రవారం రాత్రి ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితరులు (ETV Bharat)
Telangana Formation Day 2024
ట్యాంక్‌బండ్‌పై జాతీయ జెండాలతో మార్చ్‌ఫాస్ట్‌ చేస్తున్న పోలీసు సిబ్బంది (ETV Bharat)

ప్రారంభించి - రాష్ట్రం సాధించే వరకూ : రాష్ట్రసాధన ఉద్యమంలో భాగంగా అల్వాల్‌ ఐకాస ఆధ్వర్యంలో 1,136 రోజులపాటు కొనసాగిన రిలే దీక్షలు ప్రజల ఆకాంక్షకు అద్దంపట్టాయి. కేసీఆర్‌ దీక్ష అనంతరం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేస్తూ 2011 జనవరి 21న అప్పటికే ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద భారీ ప్రదర్శన అనంతరం ఈసేవ కూడలిలో దీక్షలు ప్రారంభించారు. రాష్ట్ర విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో 2014 మార్చి 1న దీక్షలు విరమించారు. దయాకర్‌, సురేందర్‌రెడ్డి నాయకత్వంలో ఐకాస కొనసాగింది. అన్ని వర్గాల ప్రజలు దీక్షల్లో కూర్చున్నారు. వివిధ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. ఇప్పటి బీఆర్ఎస్‌ అప్పటి టీఆర్ఎస్‌ నాయకులు హరీశ్‌రావు, కేటీఆర్, ఈటల రాజేందర్, ఐకాస నేత కోదండరాం, బీజేపీ నేత కిషన్‌రెడ్డిలు శిబిరాన్ని వేర్వేరుగా సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దీక్షలు కొనసాగిన వేదికను తెలంగాణ అమర వీరుల శిబిరంగా నామకరణంచేసి ప్రస్తుతం వివిధ రకాల ప్రదర్శనలకు కేంద్రంగా ఉపయోగిస్తున్నారు.

ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ : తెలంగాణ ఉద్యమ సమయంలో నగరంలోని ఎల్బీనగర్‌ కీలకంగా మారింది. తుది దశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎల్బీనగర్‌ చౌరస్తాలోనే ఒంటికి నిప్పంటించుకున్నారు. ఆసుపత్రికి తరలించగా జై తెలంగాణ అంటూ అసువులు బాశారు. శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఎల్బీనగర్‌లో పెద్దఎత్తున ఉద్యమం కొనసాగింది. కేసీఆర్‌ చేపట్టిన దీక్ష సమయంలో బీఎన్‌రెడ్డినగర్‌లో మాధవరం నర్సింహ నేతృత్వంలో నిరహార దీక్ష చేపట్టారు. ఇలా ఈ గడ్డ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండేది. ఈ ప్రాంతానికి అప్పటి ఉద్యమకారులు వచ్చి సమావేశాలు, సభలు, ధర్నాల్లో పాల్గొన్నారు.

Telangana Decade Celebrations : పదేళ్ల ప్రగతిని చాటేలా.. అమరుల త్యాగాలను స్మరించుకునేలా..

Telangana Decade celebrations 2023 : దశదిశలా దద్దరిల్లేలా 'తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు'

Last Updated : Jun 1, 2024, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.