ETV Bharat / state

ఏపీలో ఐపీఎస్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ల బదిలీలు - తహసీల్దార్లను బదిలీ

Deputy Collectors and Tahsildars transfer: ఏపీలో భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఈసీ సూచనల మేరకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం మరోసారి పలువురు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. మరికొంత మంది ఐపీఎస్ అధికారుల పోస్టింగ్​లో మార్పులు చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Deputy Collectors and Tahsildars transfer

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 8:49 PM IST

Deputy Collectors and Tahsildars transfer : రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎఎస్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లను బదిలీలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మెుత్తం ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఇచ్చిన పోస్టింగ్ లు, బదిలీల్లో మార్పు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ల బదిలీ చేసిన ప్రభుత్వం ఈసీ ఉత్తర్వుల ప్రకారం తక్షణమే ఆయా అధికారులు బదిలీ చేసిన చోట రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

పోస్టింగ్​లు, బదిలీల్లో మార్పు చేర్పులు: ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మార్పు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఇచ్చిన పోస్టింగ్ లు, బదిలీల్లో మార్పు చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. శాంతిభద్రతల అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీకి హోంగార్డ్ ఏడీజీగానూ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ రిక్రూట్​మెంట్​ బోర్డు ఛైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్యూరిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ లో శాంతిభద్రతల డీసీపీ గా కృష్ణకాంత్ ను నియమించారు. సీఐడీ ఎస్పీగా గంగాధర్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ కు కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంటుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ గా వి. రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంటుగా అమిత్ బర్దార్ ను నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగానికి ఆనంద రెడ్డి బదిలీ చేస్తూ ఈ మార్పులు చేశారు.

రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్‌ల బదిలీ

డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం: రాష్ట్రంలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కు చెందిన డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్లకు ఆయా ప్రభుత్వశాఖలు తక్షణం పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాల్సిందిగా ఆదేశాల్లో పేర్కోన్నారు. ఈసీ ఉత్తర్వుల ప్రకారం తక్షణమే ఆయా అధికారులు బదిలీ చేసిన చోట రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఏపీలో ప్రారంభమైన ఎన్నికల హడావిడి - అధికారుల బదిలీలు, పోస్టింగులపై ఈసీ మార్గదర్శకాలు

భారీగా తహసీల్దార్ల బదిలీ: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 లలో భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జోన్ 1లో 137 మంది, జోన్ 2 -170 మంది, జోన్ 3లో 154 మంది, జోన్ 4 లో 249 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈసీ నిబంధనల ప్రకారం బదిలీ అవసరం లేని అధికారుల జాబితాను కూడా పేర్కొంటూ సీసీఎల్ఏ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. మూడేళ్లు సర్వీసు దాటని, అలాగే జూన్ 30 తేదీ కంటే ముందు ఉద్యోగ విరమణ చేస్తున్న వారి వివరాలను కూడా పొందుపరుస్తూ ఈసీకి నివేదిక పంపారు.

ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ సమీక్ష - రెండు రోజుల్లో బదిలీలు పూర్తి చేయాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.