ETV Bharat / state

గ్లోబల్ సిటీ హైదరాబాద్​కు పెట్టుబడులతో తరలిరండి – ఉప ముఖ్యమంత్రి భట్టి - Deputy CM Bhatti Vikramarka US Tour

author img

By ETV Bharat Telangana Team

Published : 1 hours ago

Deputy CM Bhatti Vikramarka America Tour : తెలంగాణ రాష్ట్రం అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని కోరుతోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అమెరికన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గ్లోబల్ సిటీ హైదరాబాద్​కు పెట్టుబడులతో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని లాస్ వెగాస్​లో జరుగుతున్న మైన్​ఎక్స్ పో 2024 అంతర్జాతీయ సదస్సులో భట్టి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ హైదారాబాద్​లో ఏఐతో నిర్వహించే పరిశ్రమలు, ఏఐ అభివృద్ధి, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. ఈ విభాగాల్లో ఆసక్తిగల, అనుభవం ఉన్న ప్రపంచవ్యాప్త కంపెనీలకు తెలంగాణ స్వాగతం పలుకుతుందన్నారు.

Deputy CM Bhatti Vikramarka US Tour
Deputy CM Bhatti Vikramarka America Tour (ETV Bharat)

Deputy CM Bhatti Vikramarka US Tour : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో ఎంతో ముందు చూపుతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అమెరికన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గ్లోబల్ సిటీ హైదరాబాద్​కు పెట్టుబడులతో తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

గ్లోబల్ ఐటీ కేంద్రంగా హైదరాబాద్ : అమెరికాలోని లాస్ వెగాస్​లో జరుగుతున్న మైన్​ఎక్స్ పో 2024 అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ వ్యాప్త వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిధుల సమావేశాలలో ఆయన మాట్లాడారు. భారతదేశ ఆర్థిక పురోగతిలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని తెలంగాణలో దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ఆపిల్ సంస్థలు హైదరాబాద్​ను తమ స్వస్థలంగా భావిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని తద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్ హబ్​గా రూపుదిద్దుకున్నదని తెలిపారు.

పెట్టుబడులతో తరలిరావాలి : రాష్ట్రప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు, నైపుణ్యం గల మానవ వనరులు, చక్కని మౌలిక సదుపాయాలు గల హైదరాబాద్ సిటీ పెట్టుబడులకు స్వర్గధామం కానున్నదని అమెరికన్ కంపెనీల ప్రతినిధులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ పెట్టుబడులతో తరలిరావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మహానగరం టెక్నాలజీ హబ్​గానే కాకుండా ఫార్మాసిటీ రంగంలో గ్లోబల్ లీడర్​గా ఉంటుందన్నారు.

కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరణలు : కరోనా విపత్కర సమయంలో డాక్టర్ రెడ్డీస్​ల్యాబ్, అరబిందో ఫార్మా, బైలాజికల్-ఈ, భారత్ బయోటెక్ వంటి కంపెనీల ఆవిష్కరణలతో వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్​గా, హైదారాబాద్ నగరం ప్రపంచ ఖ్యాతి గడిచిందన్నారు. ఐటీ అభివృద్ధిలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఆవిష్కరణ జరుగుతోందన్నారు. హైదారాబాద్​లో ఏఐతో నిర్వహించే పరిశ్రమలు, ఏఐ అభివృద్ధి, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. ఈ విభాగాల్లో ఆసక్తిగల, అనుభవం ఉన్న ప్రపంచవ్యాప్త కంపెనీలకు తెలంగాణ స్వాగతం పలుకుతుందన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు : తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను కూడా వివరించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఇంధన పారిశ్రామిక విధానాలు రూపొందించడం జరిగిందన్నారు. కొత్త ఆవిష్కరణలకు, ఆర్థికాభివృద్ధికి ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలుంటాయన్నారు. హైదరాబాద్​లో ఇప్పటికే ఉన్న అమెరికన్ కంపెనీలకు ఇక్కడ సానుకూల వాతావరణం, నైపుణ్యం గల మానవ వనరులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

హైదరాబాద్​​ను ప్రపంచ ఫార్మా కంపెనీల క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్‌బాబు - Minister Sridhar Babu Meet

2035 నాటికి రాష్ట్రంలో 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యం : భట్టి - Deputy CM Bhatti On Green Power

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.