ETV Bharat / state

ఇంట్లోనే ఉంటూ ఆన్​లైన్​లో రెస్టారెంట్లు, హోటళ్లకు రేటింగ్​ ఇస్తే డబ్బులు - నిజమని నమ్మి రివ్యూ ఇచ్చారో అంతే! - Hotel Review Cyber Crime

Hotel Rating Online Fraud : ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించుకోవచ్చని ఆన్​లైన్​లో చాలా ప్రకటనలు చూస్తాం. అలాగే సెల్​ఫోన్​లకు మెసేజ్​లు సైతం వస్తుంటాయి. వీటి పట్ల ప్రజలు ఎంతో అవగాహనతో ఉండాలి. ఈజీగా ఆన్​లైన్​లో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో సైబర్​ కేటుగాళ్లు రెస్టారెంట్లు, హోటళ్లకు రేటింగ్​ ఇస్తే భారీ సంపాదించవచ్చని ఆశ చూపిస్తుంటారు. వారి మాటలు నమ్మి మెసేజ్​ను ఓపెన్​ చేసి రివ్యూలు రాసి టాస్కులు కంప్లీట్​ చేస్తే మీ అకౌంట్​ ఖాళీ అవ్వడం ఖాయం. ఇలాంటి సైబర్​ నేరాలు చేస్తున్న హైదరాబాదీని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 10:43 AM IST

Updated : Jul 15, 2024, 11:46 AM IST

Hotel Review Cyber Crime In Hyderabad
Cryptocurrency Fraud (ETV Bharat)

Hotel Rating Cyber Crime In Hyderabad : ఆన్‌లైన్‌లో రెస్టారెంట్, హోటళ్లకు రేటింగ్‌ ఇస్తూ ఇంట్లో నుంచే ఆదాయం పొందొచ్చని నమ్మిస్తూ సైబర్‌ నేరాలు చేస్తున్న హైదరాబాదీని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ శివారు మేడ్చల్‌కు చెందిన అతడిని అదుపులోకి తీసుకొని దిల్లీకి తరలించారు. అతడి నుంచి మొబైల్ ఫోన్, సిమ్‌కార్డు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మేడ్చల్‌కు చెందిన లక్కు అఖిలేశ్వర్‌రెడ్డి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు.

దీంతో పాటు మేడ్చల్‌లో స్థానికంగా ఫ్లెక్సీ వ్యాపారం చేస్తున్నాడు. డబ్బు సరిపోక ఇబ్బందులు పడుతున్న అతను తేలిగ్గా సంపాదించాలనుకున్నాడు. తనకు తెలిసిన శివతో కలిసి సైబర్‌ నేరాలు చేయాలని పథకం వేశాడు. ఆన్‌లైన్‌లో హోటళ్లకు రివ్యూలు ఇస్తే డబ్బులు సంపాదించొచ్చని టెలిగ్రామ్‌ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసాడు. ఎవరైనా సంప్రదిస్తే రివ్యూలు పూర్తి చేయాలంటూ కొన్ని టాస్కులు ఇచ్చాడు.

రివ్యూలు పూర్తి చేస్తే డబ్బులు : ఒక్కో టాస్కులో రివ్యూలు పూర్తి చేస్తే డబ్బు ఖాతాలు జమ చేస్తామని ఆశ చూపించి అమాయక ప్రజల నుంచి డబ్బు వసూలు చేసాడు. దీంతో పాటు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులకు లాభాలు వస్తాయని ప్రచారం చేసి మోసాలు చేసాడు. ఈ తరహాలోనే దిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన అక్షయ్‌కుమార్​సింగ్‌ను అఖిలేశ్వర్‌రెడ్డి మోసగించాడు. గతేడాది నవంబరు మూడో వారంలో అక్షయ్‌కుమార్‌ సింగ్‌ నుంచి రూ.20.16 లక్షలు వసూలు చేసి ఆ తర్వాత స్పందించలేదు. మోసపోయిన బాధితుడి ఫిర్యాదు మేరకు ద్వారక సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

సైబర్ నేరాల కోసం ఉపయోగించిన బ్యాంకు ఖాతాలు, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడు హైదరాబాద్‌కు చెందిన అఖిలేశ్వర్‌రెడ్డిగా గుర్తించారు. ఈ నెల 11వ తేదీన దిల్లీ నుంచి ప్రత్యేక బృందం మేడ్చల్‌కు వచ్చి అఖిలేశ్వర్‌రెడ్డిని అరెస్టు చేసింది. ట్రాన్సిట్‌ వారెంటు మీద దిల్లీ తరలించి ఆదివారం రిమాండ్​కు పంపారు. ఈ సైబర్‌ నేరాల్లో శివ అనే మరొకరి సాయం తీసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. అతడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాధితుడి కాజేసిన డబ్బును వివిధ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. అవి భాదితులకు ఇప్పించే పనిలో పడ్డారు.

అమెరికాలో మీ కుమార్తె హత్య కేసులో ఇరుక్కుంది - తండ్రిని బెదిరించి డబ్బులు లూఠీ చేసిన సైబర్​నేరగాడు - Cyber Crime in Kamareddy

బీ కేర్​ ఫుల్​ - బ్యాంకు ఖాతాను చెక్​ చేస్తున్న సైబర్​ కేటుగాళ్లు - ఈ జాగ్రత్తలు మేలు - CYBER criminals check bank balance

Last Updated : Jul 15, 2024, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.