ETV Bharat / state

'మావాళ్లు ఏం చెబితే అది చేయ్ - అన్నీ నేను చూసుకుంటా' - జగన్​ ఫోన్​లో​ చెప్పారన్న దస్తగిరి - DASTAGIRI COMMENTS on JAGAN

Dastagiri About Viveka Murder Case: వివేకా హత్య కేసు వెనుక ఎవరు ఉన్నారో, చంపించింది ఎవరో ప్రజలందరికీ తెలుసని వివేకా కేసు అప్రూవర్​ దస్తగిరి అన్నారు. జగన్​, అతని భార్య భారతి హస్తం ఉందనే కేసు విచారణ ముందుకు వెళ్లటం లేదని దస్తగిరి ఆరోపించారు. భారతి సూచన లేనిదే జగన్​ ఈ సాహసం చేసే అవకాశం లేదని దస్తగిరి వెల్లడించారు.

Dastagiri About Viveka Murder Case
Dastagiri About Viveka Murder Case
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 9:50 AM IST

Dastagiri About Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరిన్ని కీలక విషయాలు బయటపెట్టారు. ఈ హత్యలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు సీఎం జగన్‌, ఆయన భార్య భారతి హస్తం ఉందని అందుకే కేసు విచారణ ముందుకు సాగడం లేదని దస్తగిరి ఆరోపించారు. ఈ విషయం వైఎస్సార్‌ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

వివేకా హత్యకు ముందు నన్ను భాస్కర్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లగా అక్కడ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారని దస్తగిరి తెలిపారు. వాళ్లు చెప్పినట్లు చేయాలని కోరడంతో నేను వెనక్కి తగ్గడంతో వెంటనే అవినాష్‌రెడ్డి ఫోన్‌ ద్వారా జగన్‌ నాతో మాట్లాడారని అతను పేర్కొన్నారు. 'దస్తగిరీ మావాళ్లు ఏం చెబితే అది చేయ్​, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా' అని జగన్​ చెప్పడంతో ధైర్యంగా రంగంలోకి దిగానని దస్తగిరి తెలిపారు. భారతి సూచన లేనిదే జగన్‌ ఈ సాహసానికి పాల్పడే అవకాశం లేదని దస్తగిరి వెల్లడించారు.

వివేకా హత్య కేసులో సాక్షిగా పరిగణించాలని దస్తగిరి పిటిషన్ - విచారణ 29కి వాయిదా - ys viveka murder case

జగన్‌ అండతోనే ఇవన్నీ జరిగాయి: "వివేకా హత్య వెనుక జగన్‌, భార్య భారతి హస్తం ఉన్నందునే సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం చేశారు. కడపలో సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పైనే కేసు పెట్టారు. సీబీఐ వాహన డ్రైవర్‌పై బెదిరింపులకు దిగారు. జగన్‌ అండ లేకపోతే వివేకా ఇంట్లో కుక్క కూడా చనిపోదు’ అని దస్తగిరి పేర్కొన్నారు. నాకున్న గుండె ధైర్యంతోనే ఎర్ర గంగిరెడ్డి హత్యకు నన్ను ఎంచుకున్నారు. అప్రూవర్‌గా మారే ముందు నా నిర్ణయాన్ని ఎర్ర గంగిరెడ్డికి స్పష్టంగా చెప్పాను. అప్రూవర్‌గా మారినట్లైతే తనతో పాటు జగన్‌ దంపతులు కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కానీ అప్రూవర్‌గా మారకపోయి ఉంటే టీడీపీపై కేసును నెట్టేసేవారని" దస్తగిరి ఆరోపించారు.

వివేకా హత్య వెనకుంది అతడే- ప్రజా తీర్పు కోసమే సాక్ష్యాలు చూపిస్తున్నా: సునీతా

నేను తప్పు చేశాను కాబట్టే పశ్చాత్తాపంతో అప్రూవర్‌గా మారానని దస్తగిరి అన్నారు. ఎన్ని కోట్ల డబ్బులిచ్చినా తలొగ్గను మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే లక్షల హత్యలు జరుగుతాయని ప్రజలు ఆలోచించి ఓటేయాలి దస్తగిరి కోరారు. చంద్రబాబు, సునీత, షర్మిల, దస్తగిరి కలిసి తనపై పోరాటానికి దిగారని, హంతకుడు దర్జాగా తిరుగుతున్నాడని జగన్‌ ప్రొద్దుటూరు సభలో మాట్లాడారు. అది విడ్డూరం నా ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉంది. నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చు. నాలో నీతి, నిజాయతీ ఉన్నందునే పారిపోకుండా సీఎం ఇంటి పక్కనే బతుకుతున్నానని దస్తగిరి అన్నారు.

'మావాళ్లు ఏం చెబితే అది చేయ్ - అన్నీ నేను చూసుకుంటా' - జగన్​ ఫోన్​లో​ చెప్పారన్న దస్తగిరి

ఐదేళ్ల నుంచి గమ్ముగా ఉండి ఇప్పుడు వివేకా హత్య గురించి మాట్లాడుతున్నారు. ఎవరు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసు. మీరా లేక నేనా హంతకులు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. సునీతతో నాకు ఒప్పందం ఉన్నట్లు అవినాష్‌రెడ్డి నిరూపిస్తే నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధం. నిరూపించలేకపోతే అవినాష్‌రెడ్డి సిద్ధమా? నేను సవాలు విసురుతున్నాను. కడప జైల్లో నన్ను వైసీపీ నేతలు బెదిరించారు. -దస్తగిరి, వివేకా హత్య కేసులో అప్రూవర్​

కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తా: సునీత - Sunitha on Kadapa Court Order

పులివెందులలో జై భీమ్‌ భారత్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తాను ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని దస్తగిరి వాపోయారు. ఈ నెల 25న నామినేషన్‌కు సిద్ధమవుతుండగా, అదేరోజు జగన్‌ నామినేషన్‌ వేస్తారని పోలీసులు ఆంక్షలు పెట్టారు. జగన్‌ నామినేషన్‌ వేసే రోజు ఇతరులు వేయరాదనే నిబంధన ఉందా? సీఎం ఇంటికి దగ్గర్లోనే నా ఇల్లు ఉంది. అక్కడ జైభీమ్‌ పార్టీ పోస్టర్లు, బ్యానర్లు పెడితే తీసేయాలని పోలీసులు బెదిరిస్తున్నారని దస్తగిరి ఆరోపించారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీ అధినేత జడ శ్రావణ్‌కుమార్‌ ఆదుకున్నట్లు గుర్తు చేశారు.

భద్రత పెంపు : దస్తగిరికి భద్రత పెంచారు. రేపు దస్తగిరి నామినేషన్ సందర్భంగా ఇవాళ, రేపు భద్రత పెంచారు. గురువారం సీఎం జగన్ కూడా పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా దస్తగిరికి భద్రత పొడిగించారు. త్రీ ప్లస్ త్రీ, ఫోర్ ప్లస్ ఫోర్ నుంచి ఫోర్ ప్లస్ ఫోర్, టెన్‌ ప్లస్‌ టెన్‌ భద్రత కల్పించారు.

ఐదేళ్లుగా కేసు ముందుకెళ్లడం లేదు - ప్రతిదీ రాజకీయమేనా ?: సునీతారెడ్డి - YS Vivekananda Reddy Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.