Dastagiri nomination పులివెందులలో జై భీమ్రావు భారత్ పార్టీ తరపున నామినేషన్ వేయకుండా వైసీపీ నాయకులు, పోలీసులు విశ్వప్రయత్నం చేశారని వివేకా హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జై భీమ్రావు పార్టీ తరఫున పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా దస్తగిరి చివరి రోజైన ఇవాళ నామినేషన్ వేశారు. ఆయన వెంట అ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ కూడా ఉన్నారు. పులివెందల సభలో సీఎం జగన్ ఇష్టానుసారం ఏదేదో మాట్లాడుతున్నారని దస్తగిరి అన్నారు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో ఎవరు చంపించారు జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. తాను పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా వైసీపీ నాయకులు ఐదు కోట్ల రూపాయలు ఆఫర్ కూడా చేశారని దస్తగిరి వెల్లడించారు. ప్రలోభాలు, బెదిరింపులను లెక్కచేయకుండా జగన్ ను దీటుగా ఎదుర్కోవడానికి తాను పోటీలో ఉన్నానని దస్తగిరి పేర్కొన్నారు.
వివేక హత్య కేసులో తప్పు చేసిన వ్యక్తి ఇప్పుడు మారిన మనిషిగా ముందుకొచ్చాడని జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. హత్యా రాజకీయాల నుంచి మారడానికి దస్తగిరికి ఒక అవకాశం ఇచ్చి ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని జడ శ్రవణ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చార్జి షీట్లో పేర్లు ఉన్నప్పుడు ఎందుకు అవినాష్ రెడ్డి మరికొందరు నిందితులు సుప్రీంకోర్టులో చార్జి షీట్ పై సవాల్ చేయలేదని జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ఎవరికైనా మారడానికి ఒక అవకాశం వస్తుందని తప్పు చేసిన వ్యక్తి మారే అంశం పైన కూడా పురాణాల్లో ఉందని వ్యాఖ్యానించారు. న్యాయస్థానం విధించే శిక్షకు దస్తగిరి సిద్ధంగా ఉన్నారు. దస్తగిరి తరహాలో అవినాష్ రెడ్డి, భారతి రెడ్డి, జగన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? అని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ కేసు వెనక అవినాష్ రెడ్డి, భారతి రెడ్డి, జగన్ రెడ్డిలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్, అవినాష్ రెడ్డి తాము ఉత్తములమని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఓటమి ఖాయం అయ్యింది. ప్రజలు ప్రజా కంఠక ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని జడ శ్రావణ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పోలీసులు కరుడగట్టిన వైసీపీ నాయకుల్లా పనిచేస్తున్నారు: సీఎం రమేశ్ - CM Ramesh Nomination
ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ నామినేషన్ వేశాను. నామినేషన్ కోసం ఉదయం పది గంటలకు ర్యాలీ చేయాలనుకుంటే, సీఐ తనను ఇబ్బదులు పెట్టారు. ఉదయం 10 గంటలకు ర్యాలీకి రావాలనుకుంటే, పోలీసులు మధ్యాహ్నం రెండు గంటలకు రావాలని చెప్పారు. రెండు గంటలకు రావాలని బయలుదేరితే అప్పుడు కూడా సీఐ అడ్డుకున్నారు. వైసీపీ నేతలు నేను నామినేషన్ వేయకుండా నాకు రూ. 5 కోట్లు ఆఫర్ చేశారు. మైనార్టీ ఓట్లు పోతాయని నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దస్తగిరి, వివేక హత్య కేసులో అప్రూవర్
విడదల రజిని, మురుగుడు లావణ్య కిడ్నాప్- నామినేషన్ అడ్డుకున్నYSRCP - Vidadala Rajini Kidnapped