ETV Bharat / state

ఏపీ ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ బాధ్యతలు - Dammalapati Srinivas Take Charge AG - DAMMALAPATI SRINIVAS TAKE CHARGE AG

Dammalapati Srinivas Took Charge : ఆంధ్రప్రదేశన్​ నూతన ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కేటాయించిన కార్యాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు.

Dammalapati Srinivas Take Charge AG in AP
Dammalapati Srinivas Take Charge AG in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 11:40 AM IST

Updated : Jun 20, 2024, 3:17 PM IST

Dammalapati Srinivas Take Charge AG in AP : ఏపీ నూతన అడ్వకేట్ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో బాధ్యతలు చేపట్టారు. ఏజీ కార్యాలయంలో పూజ నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. ఆయనను ఏజీగా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయవాదులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. శ్రీనివాస్‌ ఏజీగా నియమితులవడం ఇది రెండోసారి.

ఏపీ ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ బాధ్యతలు (ETV Bharat)

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులకు దమ్మాలపాటి శ్రీనివాస్‌ జన్మించారు. 1991లో వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. అదే సంవత్సరం బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని హైకోర్టులో లాయర్ వృత్తిని ప్రారంభించారు. తర్వాత సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఆర్‌.అశోక్‌ వద్ద రాజ్యాంగం, క్రిమినల్, పన్నులకు, సివిల్, సంబంధించిన కేసుల్లో ప్రాక్టీస్ చేసి మంచి పేరు గడిచారు.

AP New AG Dammalapati Srinivas : 1996 నుంచి 2005 వరకు రైల్వే స్టాండింగ్‌ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1999 నుంచి 2003 వరకు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 1996 నుంచి 2002 వరకు ఆదాయపు పన్ను శాఖ జూనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. 2000 నుంచి 2005 మధ్య కాలంలో పంచాయతీరాజ్‌ సంస్థలు, మున్సిపాలిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. పలు కార్పొరేట్‌ సంస్థలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా సేవలు అందించారు.

మొదట అదనపు ఏజీగా : 2014 జూన్‌ 30 నుంచి ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్​గా హైకోర్టు, సుప్రీంకోర్టు, హరిత ట్రైబ్యునల్‌ వద్ద పలు కీలక కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి విజయం సాధించారు. హైకోర్టులో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కేసులు, చిత్తూరు జిల్లా ఎర్రచందన కూలీల ఎన్‌కౌంటర్‌ కేసు, చిత్తూరు జిల్లాలో హీరో మోటోకార్ప్‌కు కేటాయించిన భూ వివాదంపై కేసులు, పట్టిసీమ ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన కేసు, రాజధాని అమరావతి భూసమీకరణ పథకంపై కేసులలో వాదనలు వినిపించి అవరోధాలు తొలగిపోయేలా చేశారు. 2014 జూన్‌ నుంచి ఏజీగా ఉన్న సీనియర్‌ న్యాయవాది పి.వేణుగోపాల్‌ రాజీనామా చేయడంతో 2016 మే 28న దమ్మాలపాటిని ఏపీ సర్కార్ ఏజీగా నియమించింది.

ఏపీ ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - AP New AG Dammalapati Srinivas

కార్యాలయం లేదు, ఉద్యోగులూ లేరు- కమిషనర్​ రాజీనామాతో 12వ పీఆర్సీ కథ ముగిసింది! - jagan Cheating Govt Employeees

Last Updated : Jun 20, 2024, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.