Dalit Minister Humiliated on Stage of Veligonda Project: వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెళ్ల ప్రారంభోత్సవ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభ వేదికపై దళిత మంత్రికి అవమానం జరిగింది. మంత్రి ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ బాధ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరూ సీఎం పక్కన ఉన్న సీట్లలో కూర్చునేందుకు తొలుత సిద్ధమయ్యారు. అంతలో తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి వారి వద్దకు వచ్చి మాట్లాడారు. దీంతో వారిద్దరూ కుర్చీల్లో నుంచి లేచి పక్కకు వెళ్లారు. అప్పుడే వేదిక పైకి వచ్చిన జడ్పీ ఛైర్‌పర్సన్ వెంకాయమ్మ, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆ సీట్లల్లో కూర్చున్నారు. దీంతో సభ ముగిసే వరకు మంత్రి సురేష్ నిల్చొని ఉండిపోవాల్సి వచ్చింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. దళిత మంత్రికి వేదికపై సీటివ్వలేదంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
వెలిగొండ ప్రాజెక్ట్ రెండో సొరంగాన్ని ప్రారంభించిన సీఎం జగన్ - నిర్వాసితులను ఆదుకుంటామని భరోసా
CM Jagan Start To Veligonda Project Tunnel: ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ వెలిగొండ పర్యటన ఒక నాయకుడికి మోదాన్ని కలిగిస్తే మరొకరికి ఖేధాన్ని మిగిల్చింది. వేదికపైన ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలకు పరిచయం చేయడంలోనూ ముఖ్యమంత్రి జగన్ తడబడ్డారు. జగన్ ఉపన్యాసం ముగిసిన తర్వాత యర్రగొండ పాలెం ఎమ్మెల్యేగా చంద్రను, ఎంపీగా భాస్కర్లను గెలిపించాలని ఆయన కోరారు. ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తన పేరు చెప్పండి అని కోరగా అతడిని మీరు గిద్దలూరు అని జగన్ సంబోధించారు.
సీఎం పర్యటనలో భాగంగా లబ్ధిదారులతో మాట్లాడతారని షెడ్యూల్లో ప్రకటించారు. అయితే వైసీపీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే పాసులిచ్చారు. పోలీసు అధికారులు వారి పాస్‌లతో పాటు ఆధార్ కార్డులను సైతం పరిశీలించిన తర్వాతే లోపలికి పంపించారు. ఆధార్ కార్డులు, పేర్లు లేని వారిని బయటకు గెంటేశారు. సీఎం వచ్చే సమయానికి సభా ప్రాంగణం నిండకపోవడంతో చేసేదేమీ లేక బయట ఉన్న వారందరినీ లోపలికి పంపించారు.
ఉత్తుత్తి ప్రారంభోత్సవాలతో రైతులు సంతోషిస్తారా జగన్ ?: టీడీపీ
Police Not Allow The Reporters Sabha inside: సీఎం జగన్ కార్యక్రమానికి వచ్చిన విలేకరులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఐఅండ్‌పీఆర్ అధికారులు వారితో మాట్లాడిన గంట తర్వాత లోపలికి పంపించారు. వారిని మీడియా గ్యాలరీలోకి కాకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలున్న చోటికి పంపించారు. సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెతో వచ్చిన ఓ వ్యక్తి విషయంలోనూ పోలీసులు ఇదే విధంగా ప్రవర్తించారు. సీఎం సహాయం కావాలని కోరేందుకు వచ్చానంటూ చెప్పినా అతన్ని పోలీసులు నిలువరించారు. జిల్లా కలెక్టర్ నిర్వహించే స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వాలంటూ అతడిని తిప్పి పంపించేశారు. వినతులు ఇచ్చే అవకాశం కూడా లేకపోవడంతో పలువురు అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగారు.
అసంపూర్తిగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు - నేడు ప్రారంభించడానికి జగన్ సిద్ధం