ETV Bharat / state

రాత్రికి తీరం దాటనున్న రెమాల్ తుపాను - గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు - CYCLONE REMAL EFFECT - CYCLONE REMAL EFFECT

Cyclone Remal Effect on AP: రెమాల్ తుపాను ఉద్ధృతమై తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ఈరోజు అర్ధరాత్రి తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. అయితే తుపాను ప్రభావం ఏపీపైన పెద్దగా ఉండదని చెప్తున్నారు. మరోవైపు తుపాను కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగసి పడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.

remal cyclone effect
remal cyclone effect (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 3:24 PM IST

Updated : May 26, 2024, 4:46 PM IST

రాత్రికి తీరం దాటనున్న రెమాల్ తుపాను - గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు (ETV Bharat)

Cyclone Remal Effect on AP: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఉద్ధృతమై తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ఈ తుపాను బంగ్లాదేశ్ కేపుపారాకు దక్షిణ నైరుతి దిశగా 260 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బంగాల్ సాగర్ ఐలాండ్స్​కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపుపారా – వెస్ట్ బంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుపాను తీరం దాటనుంది.

తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో 80 కిలోమీటర్లు వేగంతో, ఉత్తర బంగాళాఖాతంలో 80 నుంచి 85 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు ఉంటాయి.

దూసుకొస్తున్న 'రేమాల్' తుపాను - ఏయే రాష్ట్రాలపై ప్రభావం ఉందంటే - Cyclone Remal Effect on AP

తుపాను ప్రభావం పశ్చిమ బంగాల్, ఒడిశా మీద స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మే 27వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు సూచనలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో ఒడిశా, బంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో తుపాను నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

తుపాన్ ప్రభావం ఉండదు: ఆంధ్రప్రదేశ్​పై తుపాన్ ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్తున్నారు. కానీ ఏపీలో పలుచోట్ల చెదురు మొదురు వర్షాలు, ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం పూట అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సాయంత్రం మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు

రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు - AP WEATHER REPORT TODAY

ఎగసి పడుతున్న రాకాసి అలలు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుపాను ప్రభావం కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై పడింది. సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రహదారిపైకి కెరటాలు దూసుకొస్తున్నాయి. ప్రయాణికులు రాకపోకలు సాగించటానికి ఇబ్బంది పడుతున్నారు. రహదారి మీదుగా ప్రయాణం ప్రమాదమని గుర్తించిన అధికారులు రహదారిని మూసేశారు. ఉప్పాడ, కొనపాపపేట, మాయపట్నం తదితర గ్రామాలపై సముద్రపు అలలు విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికే పలు గృహాలు కోతకు గురయ్యాయి.

వాయుగుండం ప్రభావం - ఈదురుగాలులతో భారీ వర్షం - rain effect in ap

Last Updated : May 26, 2024, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.