ETV Bharat / state

ఆంధ్రాకు మరో తుపాను హెచ్చరిక​ - ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు! - CYCLONE ALERT TO ANDHRA PRADESH

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి మరోసారి తుపాను హెచ్చరిక - దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు - భారత వాతావరణ కేంద్రం వెల్లడి

Cyclone Threat to Andhra Pradesh
Cyclone Threat to Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 10:35 AM IST

Updated : Oct 11, 2024, 3:24 PM IST

Cyclone Threat to Andhra Pradesh : తుపాను వల్ల వచ్చిన భారీ వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి మరో హెచ్చరిక. రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు పంపింది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం శనివారం నాటికి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత అది పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని చెప్పింది. దీంతో ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.

ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈనెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. ఇది తుపానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాతనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా.

ఆ మూడు భారీ వర్షాలు :

  • ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
  • ఏలూరు, ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పడీనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది గోవా, కర్ణాటక తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ రెండు లేదా మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ వివరించింది.

మరోవైపు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి కరీంనగర్​లో భారీ వర్షం పడింది. ఇటు హైదరాబాద్​లోనూ నిన్నటి నుంచి మేఘావృతమై ఉంది. నిన్న ఉదయం పలుచోట్ల వర్షం పడింది. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు నగరవాసులను పలకరించాయి. రేపటి వరకు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం - జలమయమైన రహదారులు

హైదరాబాద్‌లో మరోసారి భారీవర్షం - అవసరమైతే తప్ప బయటకు రావొద్దు : జీహెచ్​ఎంసీ - Hyderabad Rains Updates

Last Updated : Oct 11, 2024, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.