ETV Bharat / state

3 నెలల్లో 1000 సెల్​ఫోన్లు స్వాధీనం - సైబరాబాద్​ పోలీసుల రికార్డ్ - Police Recover 1000 Phones in hyd

Cell Phones Recovery in Hyderabad : సెల్‌ ఫోన్‌ పోయింది, ఇక మళ్లీ దొరుకుతుందనే ఆశా పోయింది. సరిగ్గా ఈ సమయంలోనే బాధితుల అడియాశకు జీవం పోస్తూ పోలీసులు చరవాణులను ట్రేస్‌ చేసి పట్టుకుంటున్నారు. పోయిన మీ ఫోన్‌ దొరికిందని బాధితులకు సమాచారం అందజేస్తున్నారు. ఊహించని విధంగా పొయిన ఫోన్‌ తిరిగి దొరకడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా గత మూడు నెలల్లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు 1000 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు.

Cell Phones Recovery in Hyderabad
Cell Phones Recovery in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 6:49 PM IST

Updated : Aug 30, 2024, 10:03 PM IST

Cyberabad Police Recovers 1000 Phones in 3 Months : ప్రస్తుత టెక్నాలజీ కాలంలో సెల్​ఫోన్​ మనిషి జీవితంలో నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అది పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. అయితే ఆ చరవాణి ఉంటే చేతిలోనే సమస్త ప్రపంచం మన వద్ద ఉన్నట్లే. ఎలాంటి సమాచారం కావాలన్న ప్రస్తుతం ప్రతి ఒక్కరు సెల్​ఫోన్​నే ఉపయోగిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు సహా సులభంగా సమాచారం సెల్​ఫోన్​లో పొందవచ్చు. అటువంటి ఫోన్​ పోయిందంటే ఆ బాధను చెప్పడానికి మాటలు రావు.

ముఖ్యంగా రాష్ట్ర రాజధాని సహా అనేక ప్రాంతాల్లో సెల్​ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఫోన్లను లాక్కుని వెళ్లిపోతున్న ముఠాల ఆగడాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వెయ్యి సెల్​ఫోన్లను సైబరాబాద్​ పోలీసులు పట్టుకున్నారు.

570 ఫోన్లు స్వాధీనం : నగరంలో చోరీ అయిన ఫోన్లను పట్టుకోవడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన ఫోన్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గత 25 రోజుల్లో సైబరాబాద్​ నేర విభాగం పోలీసులు 570 సెల్​ఫోన్లను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్​ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు.

తమ సెల్​ఫోన్​ పోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని బాధితులు వాపోయారు. అసలు చరవాణి దొరుకుతుందని ఎప్పుడూ అనుకోలేదని తిరిగి అది దొరికినట్లు పోలీసుల నుంచి సమాచారం రాగానే నమ్మలేకపోయినట్లు పలువురు బాధితులు తెలిపారు. ఫోన్​ పోయినప్పటికీ నెలవారీ ఈఎంఐ చెల్లించామని మరికొంత మంది బాధితులు చెప్పారు. ఎంతో విలువైన సమాచారం నిక్షిప్తమై ఉన్న ఫోన్​ దొరకడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

ఫోన్​ మిస్​ అయిన వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయండి : ఎవరైనా సెల్​ఫోన్​ కనిపించకుండా చోరీ అయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నగర పోలీసులు సూచించారు. అవసరమైతే సీఇఇఆర్​ యాప్​ ద్వారా బాధితులు రిజిస్టర్​ చేసుకోవచ్చని పోలీసులు అధికారులు తెలిపారు. ఫోన్ల విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ముఖ్యమైన అంశాన్ని మొబైల్​ ఫోన్లలో భద్రపరుచుకుంటున్నారని అలాంటి ఫోన్​ పోతే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసునని చెప్పారు.

మీ పాత ఫోన్​ను అమ్మేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజర్​లో పడ్డట్టే! - OLD PHONES SELLING TO STRANGERS

మార్కెట్​లో ఫోన్ కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ - పోల్​కు కట్టేసి చితకబాదిన వ్యాపారస్థులు - Traders Caught Mobile thief

Last Updated : Aug 30, 2024, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.