Cyber Criminals Use CS Santhi Kumari Picture : రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువవుతున్నాయి. సామాన్య ప్రజలకు ఆశ చూపించి నగదును తీసుకోవడం, వారి అకౌంట్లు నుంచి సమాచారాన్ని పొందడం చేస్తున్నారు. మరికొందరికి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలని ఆశ చూపిస్తున్నారు. ఇలానే ఇంకొంత మందికి ప్రైజ్ మనీ పేరుతో నిలువు దోపిడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. కేటుగాళ్లు సామాన్య ప్రజలనే కాదు అధికారులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కూడా బెడద తప్పలేదు. తన ఫొటో డీపీగా పెట్టుకోని మోసాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు సీఎస్ శాంతి కుమారికి ఫిర్యాదు చేశారు.
Cyber Criminals Fake Calls Shanthi kumari Name : నేపాల్ దేశానికి చెందిన +977-984-4013103 నంబర్‌తో కొందరు ఫోన్లు, మెసేజ్‌లు చేసి మోసాలు చేస్తున్నారని పోలీసులు శాంతి కుమారి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అప్రమత్తమైన ఆమె సీఎస్ కార్యాలయం ప్రతినిధి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'ప్రముఖుల పేర్లతో ఫేక్ అకౌంట్స్ - ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి'
Cyber Criminals Create VIPs Fake Accounts : ఇటీవలే ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు తయారు చేసి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. ప్రముఖుల పేర్లు, ఫొటోలు పెట్టి సామాన్యులకు సందేశాలు పంపి డబ్బు కాజేస్తున్నారని వివరించారు. తెలియని వ్యక్తి నుంచి, నంబర్ నుంచి వచ్చే సందేశాలు, కాల్స్, వాట్సాప్ కాల్స్ ఇతర లింకులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ప్రముఖులు తమకు సందేశాలు పంపారని చెక్ చేసుకోకుండా ఎలాంటి లింక్‌లపై క్లిక్ చెయ్యవద్దని సూచించారు. సీఎస్ శాంతి కుమారి ఫొటో ఏ విధంగా ఫేక్ ఖాతా చేసి కాల్స్, మెసేజ్ చేస్తున్నారో అలానే గతంలో మహేష్ బాబు కుమార్తె సితార, ఏసీబీ డీసీ సీవీ ఆనంద్ ఫేక్ ఖాతాలు తెరిచి మోసాలు చేశారు.
సైబర్ నేరాల్లో డబ్బులు కోల్పోతున్న బాధితులు - కొత్త విధానంతో సొమ్మును రికవరీ చేస్తున్న పోలీసులు
సైబర్ నేరాల్లో ఇదో కొత్తరకం - ఫేక్ లీగల్ నోటీసులతో సొమ్ము కాజేస్తున్న గ్యాంగ్ అరెస్ట్