ETV Bharat / state

నీ భర్తను అరెస్ట్ చేశాం డబ్బు ఇస్తే వదిలేస్తామంటూ ఫేక్ సీబీఐ కాల్ - మహిళ రియాక్షన్ చూస్తే వావ్ అనాల్సిందే!! - FAKE CBI VIDEO CALL IN HYDERABAD

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 9:57 AM IST

Fake CBI Frauds In Telangana : రాష్ట్రంలో సైబర్​ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ మహానగరంలోని ఓ మహిళకు సైబర్​ నేరగాళ్లు వీడియో కాల్​ చేసి ఆమె భర్త, కుమారుడిని సీబీఐ అరెస్టు చేసిందని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే రూ.50 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే?

Cyber Frauds in Telangana
Cyber Frauds in Telangana (ETV Bharat)

Fake CBI Call Frauds In Hyderabad : ఇటీవల కాలంలో సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి సొమ్ము దోచేందుకు నయా మార్గాలను అనుసరిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఉపయోగించుకుని బెదిరింపులకు పాల్పడి డబ్బులు దోచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్​ నగరంలో జరిగింది.

సీబీఐ పోలీసులమని చెప్పి : నగరానికి చెందిన ఓ మహిళకు మంగళవారం రోజున సైబర్‌ నేరస్థుల నుంచి వీడియో కాల్‌ వచ్చింది. తెలిసినవారనుకొని ఆమె కాల్‌ లిఫ్ట్‌ చేసింది. అంతే క్షణాల్లోనే ఎదురుగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తాము సీబీఐ పోలీసులమని అవతలి వ్యక్తులు పరిచయం చేసుకున్నారు. మీ భర్త, కుమారుడిని డ్రగ్, మనీలాండరింగ్‌ కేసులో ‘నాన్‌-బెయిల్‌ వారెంట్‌’పై అరెస్టు చేశామని ఆమెకు తెలిపారు. వారిని కేసు నుంచి తప్పించాలన్నా ఇంటికి పంపాలన్నా వెంటనే రూ.50 వేలు తాము చెప్పిన అకౌంట్​కు ట్రాన్స్​ఫర్​ చేయాలని హుకుం జారీ చేశారు.

గృహిణికి భర్త ఏడుపు వినిపించి : పోలీసు సిబ్బంది వారిపై లాఠీలతో దాడి చేస్తున్నారు. ఎలా ఏడుస్తున్నారో వినండి అంటూ బాధితురాలికి ఏడ్పులు వినిపించారు. దాంతో ఆమె నిజమేననుకొని భయపడి వణికిపోయింది. తమ వారిని సంప్రదిస్తానని ఆమె చెబితే 'వీడియోకాల్‌ కట్‌ చేసినట్లయితే మీ వాళ్లు ఇంటికి కాదు నేరుగా జైలుకెళ్తారని' కేటుగాళ్లు బెదిరించారు. డబ్బుల కోసం తొందరపెడుతూ ఆ మహిళను మానసికంగా వేధించారు.

వీడియో కాల్​ కట్​ చేసి భర్తకు ఫోన్​ : ఓ సందర్భంలో ఆమె డబ్బు పంపిద్దామనే నిర్ణయానికి కూడా వచ్చారు. వారి వ్యవహార శైలిపై అనుమానం వచ్చి ధైర్యం చేసి ఆ వీడియో కాల్‌ కట్‌ చేసింది. వెంటనే తన భర్తకు ఫోన్‌ చేయగా ఆయన మాటలు విని ఊపిరి పీల్చుకుంది. జరిగిందంతా ఆమె భర్తకు వివరించింది. అనంతరం భర్తతో కలిసి హైదరాబాద్‌ సైబర్‌ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అప్రమత్తతే శ్రీరామరక్ష : సైబర్​ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తరచూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష అని సైబర్​ నిపుణులు చెబుతున్నారు. అలాంటి కాల్స్ వచ్చిన వెంటనే భయపడకుండా పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

'మీ బాబును కిడ్నాప్ చేశాం మేమడిగినంత డబ్బివ్వకపోతే చంపేస్తాం' - ఇలాంటి ఫోన్​కాల్స్ మీకూ వస్తున్నాయా? - CYBER CRIMINALS FAKE KIDNAP CALLS

'మీ పార్శిల్​లో డ్రగ్స్ ఉన్నాయి నేనడిగిన డబ్బివ్వకపోతే జైలుకే'​ - ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? ఐతే బీ కేర్​ఫుల్ - FedEx Crimes In Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.