Cyber Crimes In Telangana : దొంగతనమంటే గోడలు దూకాలి, కిటికీలు ఊడదీయాలి, ఇంట్లో దూరాలి. డబ్బులు, నగలు ఎత్తుకెళ్లాలి. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారింది. కూర్చున్న చోటు నుంచే కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇంటర్నెట్‌ను ఉపయోగించి వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడమే కాకుండా ఇతరత్రా జరిగే అన్ని నేరాలను ఇంటర్నెట్ ఫ్రాడ్‌గా గుర్తిస్తుంటాం. అయితే ఇప్పుడు ఈ నేరాలన్నీ ఆర్థిక నేరాలే అన్నట్టుగా తయారయ్యాయి.
Cyber Frauds : గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరస్థులు ఏకంగా 157 కోట్ల రూపాయలు లూటీ చేయడమే ఇందుకు నిదర్శనం. ప్రధానంగా పెట్టుబడుల పేరుతో సైబర్ నేరాలు పెరిగి పోయాయి. వాట్సాప్, టెలిగ్రామ్‌ల వేదికగా నేరగాళ్లు అమాయకులకు వల వేయడం వారితో సొమ్ము పెట్టుబడి పెట్టించి, మోసం చేయడం పరిపాటైంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ (Hyderabad) సీసీఎస్ పోలీసులు ప్రతి బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
పెట్టుబడుల పేరిట 70 ఏళ్ల వృద్ధుడి నుంచి 22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరాలు : జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ కరపత్రాలు పంచుతున్నారు. సైబర్ నేరాలపై (Cyber Crimes) అవగాహన కల్పించడమే కాకుండా వాటిని ఎలా అరికట్టవచ్చో వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను ఓపెన్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరికి వాటి పట్ల అవగాహన అవసరమని పోలీసులు చెబుతున్నారు. ఆర్థిక నేరాల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష అని స్పష్టం చేస్తున్నారు.
"సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల చాలా మందికి అవగాహన లేదు. ఫోన్‌కు వచ్చిన ఓటీపీలు చెప్పడం ద్వారా, కార్డు బ్లాక్ అయ్యిందని వెంటనే కేవైసీ అప్డేట్ చేయడం వంటి వల్ల మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. డెబిట్ కార్డు ఇచ్చినప్పుడు కిట్‌లో ఉన్న సూచనలు జాగ్రత్తగా చదివితే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. ఆన్లైన్ లావాదేవిలు చేసే క్రమంలో టెక్నాలజీని వాడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం." - దార కవిత, డీసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్
స్టాక్మార్కెట్లో పెట్టుబడుల ఆశ చూపి - హైదరాబాద్‌కు చెందిన వృద్ధుడికి రూ.5.98 కోట్లు టోకరా
సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ వ్యూహాత్మక అడుగులు - సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం - ప్రణీత్ రావు సహా మరికొంత మందిపై కేసు నమోదు