Cyber Crimes in AP : చిటికెలో లక్షలు రూపాయలు సంపాదించేద్దాం అని అరాటపడే ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్లకు చాలా తేలికగా చిక్కుతున్నారు. గతంలో నిరాక్షరాస్యత, అజాగ్రత్తల వల్ల సైబర్ మోసాల బారిన పడేవారు అధికం. నేటి కాలంలో ఉన్నత చదువులు చదివిన యువత, ఐటీ ఉద్యోగులే ఎక్కువగా మోసపోతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల సొమ్ములన్నీ ఖాళీ చేస్తారని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ కేసుల్లో అత్యధికంగా విశాఖ వాసులు ఉండటం గమనార్హం.
ఇంకా రూ.13కోట్లు అక్కడే: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని తెలిశాక వెంటనే సైబర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు రంగంలోకి దిగుతారు. మాయగాళ్లు ఆ సొమ్ము బ్యాంకుల నుంచి తీసేసేలోపు (గోల్డెన్ అవర్) ఫ్రీజ్ చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ నగదు చెల్లించాలంటూ బీఎన్‌ఎస్‌ఎస్ (BNSS) సెక్షన్లు 497, 503 కింద కోర్టులో దరఖాస్తు చేసుకుంటే పోలీసు, న్యాయ, ఆర్థిక రంగాల సమన్వయంతో డబ్బు తిరిగి పొందవచ్చు. సైబర్ నేరాల గణాంకాల(Cyber crime statistics) ప్రకారం విశాఖలో రూ.18 కోట్లు వివిధ బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ అయింది. తొలి విడతగా ఇటీవల రూ.4.65 కోట్లు బాధితులకు అధికారులు తిరిగి ఇచ్చారు. ఇంకా రూ.13 కోట్లకు పైగా అందించాల్సి ఉంది.
పెళ్లి పేరుతో యువతి ఘరానా మోసం - రూ.28 లక్షల టోకరా - Cyber Crimes in AP
సైబర్ మోసానికి గురైన వ్యక్తి గోల్డెన్ అవర్‌లోనే 1930 నంబర్‌కు కాల్ చేయాలి. లేదా (www.cyber crime statistics.gov.in) లో ఫిర్యాదు చేయాలి. తద్వారా బ్యాంకు అకౌంట్ లో నగదును ఫ్రీజ్ చేయటానికి అవకాశం ఉంటుంది- ఫక్కీరప్ప, విశాఖ జాయింట్ కమీషనర్
అవగాహనకు: సైబర్ నేరాలపై డాక్యుమెంటరీని విశాఖ పోలీసులు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సైబర్ క్రైంలు జరిగాయి? ఎన్ని విధాలుగా ప్రజలను మోసం చేసే అవకాశాలు ఉన్నాయి? అనే దానిపై డాక్యుమెంటరీని సిద్ధం చేస్తున్నారు. దీనిని మరో రెండు నెలల్లో పూర్తి చేసి ప్రతి గ్రామంలో, థియేటర్లలో, వాణిజ్య సముదాయాల్లో బస్‌స్టాండ్లలో ప్రదర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు.
పెరుగుతున్న సైబర్ మోసాలు - మూడేళ్లలో రూ.940 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు - Cyber Frauds in AP
అలా మోసం చేయిస్తూ : విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట రాష్ట్రానికి చెందిన పలువురిని కంబోడియాకు తీసుకువెళ్తారు. అక్కడ చీకటి గదుల్లో బంధించి ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు ఆన్‌లైన్ స్కాంలు చేయాలని వారిని చిత్రహింసలకు గురి చేసిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. సైబర్ మోసాల్లో వచ్చిన డబ్బులో 99% కంబోడియా ముఠా తీసుకుంటారు. మిగిలిన ఒక శాతం కూడా బాధితులు అక్కడే ఖర్చు చేసేలా పబ్, క్యాసినో, వ్యభిచారం వంటి సదుపాయాలు కల్పించినట్లు అధికారుల విచారణలో తేలింది. గత కొద్ది రోజుల క్రితమే విశాఖ పోలీసులు ఈ ముఠా చేతుల్లో చిక్కిన 58 మందిని రక్షించారు.
సైబర్ వల విసురుతారు : ప్రతి రోజూ 100 మందికి పైగా ఫోన్ కాల్స్, లింకులు పంపి సైబర్ నేరగాళ్లు వల వేస్తుంటారు. స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్, టాస్క్ గేమ్, ఫెడెక్స్, ట్రాయ్ కాల్, పార్ట్ టైం జాబ్ వివిధ పద్ధతిలో బాధితులకు ఫోన్ చేసి నమ్మిస్తారు. తాజాగా మనీ ల్యాండరింగ్ కేసులు ఉన్నాయంటూ బెదిరింపు కాల్స్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
5స్టార్ రేటింగ్ సైబర్ క్రైమ్- సుమారు ₹5 లక్షలు! - Cyber Crime in Krishna District