Cyber Crime in Congress Crowd Funding : సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి కొత్త పథకంతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ విషయం తెలియక అమాయకులు నగదును పొగొట్టుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పేరుతో వెబ్‌సైట్‌ను తయారు చేసి ఫండింగ్ ద్వారా కేటుగాళ్లు డబ్బులు కాజేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సురేంద్ర చౌదరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరిట నకిలీ వెబ్‌సైట్ రూపొందించాడు.
98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్
Officials Instructions on Cyber Crime Criminals : నకిలీ వెబ్‌సైట్ సాయంతో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రజల నుంచి విరాళాలు సేకరించాడు. విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఈ వ్యవహారంపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ తరహా నకిలీ వెబ్‌సైట్లను ప్రజలు నమ్మవద్దని సైబర్ క్రైం పోలీసులు(Cyber Crime Police) ప్రజలకు సూచిస్తున్నారు.
పోలీసుల సైబర్ గస్తీ - ఇక కేటుగాళ్ల ఆటకట్టు
Ayodhya Ram Mandhir Cyber Crime : మరోవైపు అయోధ్య రామ మందిరానికి ఉన్న పేరును వాడుకుని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర్ పేరుతో(Ayodhya Ram Mandhir) చరవాణులకు వచ్చే సందేశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో(Cyber Security Buereau) డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. నకిలీ ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ తయారు చేస్తున్నారని గోయల్ తెలిపారు. అయోధ్య రామ మందిర్‌కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా భక్తులను మోసం చేయడానికి కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారన్నారు.
ప్రసాదం డెలివరీ పేరుతో ఏదైనా క్యూఆర్ కోడ్ పంపిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. అయోధ్య పేరుతో నకిలీ వెబ్సైట్లు కూడా తయారు చేస్తున్నారని తెలిపారు. అయోధ్య రామ మందిర్ నుంచి ఎలాంటి లింకులు వచ్చినా వాటిని క్లిక్ చేయవద్దని సూచించారు. ఏదైనా లింకులు కనిపిస్తే 8712672222 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని శిఖా గోయల్ విజ్ఞప్తి చేశారు.
సైబర్ మోసానికి గురయ్యారా? సింపుల్‌గా కంప్లైంట్ చేయండిలా!
సైబర్ క్రైమ్స్‌లో మొదటి స్థానంలో తెలంగాణ - ఆర్థిక నేరాలు, ఫేక్ న్యూస్ వ్యాప్తిలోనూ మనమే