Asia Pacific CEO Matthew Bouw Met CM Revanth Reddy : హైదరాబాద్‌ను న్యూయార్క్ నగరంలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని హైదరాబాద్‌ను ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలనేది తమ సంకల్పమని సీఎం అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు మార్గాల విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారు కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మాథ్యూ భౌ బృందం భేటీ అయింది.
Telangana New ITI Colleges : హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న విధానంపై సమావేశంలో చర్చ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తమ అధ్యయనంలో తేలిందని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ కంపెనీ ప్రతినిధి బృందం వివరించింది. గడిచిన ఆరు నెలల్లో రియల్టీతో పాటు లీజింగ్, ఆఫీసు స్పేస్, నిర్మాణ రంగం, రెసిడెన్షియల్ స్పేస్‌లోనూ హైదరాబాద్ సిటీ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని ఆ సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ఆరు నెలలకోసారి వెల్లడించే తమ నివేదిక జులై నెలాఖరులో వెలువడుతుందని పేర్కొంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో సూపర్ జాబ్స్.. రూ.60 వేల వేతనం.. అద్దిరిపోయే కెరీర్!
Investments in Telangana : సాంకేతిక నైపుణ్యం, అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంటర్ స్థాయిలోనే విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఐటీఐలలో ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా, విజ్ఞాన కేంద్రాలుగా మారనున్నాయని మంత్రి తెలిపారు. దీనికోసం టాటా టెక్నాలజీస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రోబోటిక్స్, కృత్రిమ మేధ, వర్చువల్ రియాల్టీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించనున్నామని వివరించారు. యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా త్వరలో నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీ ప్రారంభించనున్నామని వెల్లడించారు.
'హైదరాబాద్ అభివృద్ధిలో మెట్రో రైలు పాత్ర ఎంతో కీలకం - త్వరలోనే రెండో దశ పనులు'