Chocolate ChessBoard in Hyderabad : వామ్మో అతిపెద్ద చెస్ బోర్డు చూడగానే ఒక్కో గడిలో అడుగు పెడుతూ పావులతో ఎత్తులు వేయొచ్చు అనుకుంటున్నారా? అయితే మీరు చాక్లెట్‌లో కాలు వేసినట్లే. ఎందుకంటే దీన్ని 250 కిలోల చాక్లెట్‌తో తయారు చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని కలినరీ అకాడమీ క్రిస్మస్ సందర్భంగా 16 అడుగుల వెడల్పు 16 అడుగుల పొడవుతో 256 చదరపు అడుగుల విస్తీర్ణం గల అతిపెద్ద చదరంగం బోర్డుని తయారు చేసింది.
సోమవారం నాడు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశం అతిథులుగా హాజరై చెస్ బోర్డును ఆవిష్కరించారు. 25 మంది చెఫ్‌లు వారం పాటు శ్రమించి దీనిని రూపొందించారని కలినరీ అకాడమీ ఛైర్మన్ సుధాకర్‌రావు తెలిపారు. ప్రపంచ రికార్డు కోసం ఈ ప్రయత్నం చేసినట్లు ఆయన చెప్పారు.
Christmas 2024 celebrations; మరోవైపు క్రిస్మస్ సందడి మొదలైంది. మార్కెట్‌లో క్రిస్మస్ నక్షత్రాలు, అలంకరణ వస్తువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. క్రైస్తవులు ప్రార్థనాలయాలు, గృహాలపై నక్షత్రాలను ఏర్పాటు చేశారు. చర్చిలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. క్రిస్మస్ ట్రీలు, పశువుల పాకలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. పశువుల పాకల్లో బాల ఏసు జనన ఘట్టాన్ని కళ్లకు కట్టేలా బొమ్మలతో అలంకరణ చేస్తున్నారు. మరోవైపు వివిధ చోట్ల ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు.
క్రైస్తవులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
మెదక్‌లో కెథడ్రల్ చర్చికంటే పాతది ఇదే - 375 రూపాయలతో నిర్మాణం