Crocodile on Road in Medak District: మెదక్ జిల్లా పసుపులేరు వాగు సమీపంలో హైదారాబాద్ ప్రధాన రహదారిపై గురువారం అర్ధరాత్రి మొసలి కలకలం రేపింది. మొసలిని చూసి ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు. వర్షాకాలంలో పసుపులేరు వారు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అందువల్ల వాగులోనే మొసలి నివాసం ఏర్పాటు చేసుకుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాగులో నీళ్లు తక్కువగా ఉండటంతో రోడ్డుపైకి మొసళ్లు వస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు బోను పెట్టి మొసలిని పట్టుకొని సంరక్షణ ప్రాంతాలకు తరలించాలని పట్టణవాసులు కోరుతున్నారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు మొసలిని చూసి తమ ఫోన్లలో చిత్రీకరించడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గ్రామంలోకి మొసలి.. స్థానికులు హడల్.. 3గంటల పాటు శ్రమించి..
నది ఒడ్డున బట్టలు ఉతుకుతున్న మహిళ.. ఒక్కసారిగా మొసలి దాడి చేసి.. నీటిలోకి లాక్కెళ్లి..