ETV Bharat / state

అక్రమ నిర్మాణాలకు అనుమతులు - హైడ్రా సిఫార్సుతో ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు - HYDRA Action Against Officials

HYDRA Action Against Officials : హైదరాబాద్​ నగర పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్‌ ఆర్థిక నేర యూనిట్​లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Criminal Cases Registered Against Officials
HYDRA Action Against Officials (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 2:21 PM IST

Criminal Cases Registered Against Officials : హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు హైడ్రా చేసిన సిఫారసు ఆధారంగా సైబరాబాద్‌ పోలీసులు ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్‌లో కేసులు నమోదుచేసినట్టు సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. ఈ కేసులు నమోదు చేసిన వారిలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్​ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదాంశు, బాచుపల్లి ఎమ్మార్వో పూల్‌సింగ్‌, మేడ్చల్-మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్‌ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్​ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్‌, హెచ్​ఎండీఏ సిటీ ప్లానర్‌ రాజ్‌కుమార్‌లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎఫ్​టీఎల్​లో అనుమతులు ఇచ్చినందుకు ఆయా అధికారులపై చర్యలు చేపట్టాలని రెండురోజుల క్రితం హైడ్రా చేసిన సిఫారసుల ఆధారంగా సైబరాబాద్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.