ETV Bharat / state

ఖమ్మంలో 'విరాట్ కోహ్లీ' - మీరూ వెళ్లి హాయిగా ఫొటోలు తీసుకోవచ్చు! - VIRAT STATUE IN KHAMMAM

ప్రముఖ క్రికెటర్​ విరాట్​ కోహ్లీ విగ్రహం ఏర్పాటు - క్రికెట్​ నేర్చుకునేవారికి స్ఫూర్తిగా విగ్రహం - ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్​ పటేల్​ స్టేడియంలో నెలకొల్పిన నిర్వాహకులు

Virat Kohli Statue
Virat Kohli Statue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2024, 12:54 PM IST

Virat Kohli Statue : విరాట్​ కోహ్లీ పేరు వింటేనే క్రికెట్ అభిమానుల్లో ఎనలేని జోష్ వస్తుంది. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ సాగిపోయే కోహ్లీని రన్​ మెషీన్​ అంటూ కొనియాడుతుంటారు. విరాట్​ బ్యాట్​ పట్టుకొని గ్రౌండ్​లోకి దిగితే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే. వన్డే క్రికెట్​లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు. కేవలం బ్యాటింగ్​లోనే కాదు, ఇటు ఫీల్డింగ్​లోనూ అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పాడు. విరాట్​ వైపు బాల్​ వెళ్లిందంటే ఎలాంటి బ్యాట్సెమెన్​ అయినా రెండో పరుగు కోసం ఆలోచించాల్సిందే. దీంతో ప్రపంచ క్రికెట్​లోనే అత్యుత్తమ ఫీల్డర్​లో ఒకడిగా 'చీకూ'కు పేరుంది.

అలాగే ఫిట్​నెస్​ విషయంలోనూ విరాట్​ తర్వాతనే ఎవరైనా అనేలా ఉంటుంది అతడి శరీర దారుఢ్యం. తోటి క్రికెటర్లకు ఫిటెనెస్​ విషయంలో ఎప్పుడూ స్ఫూర్తిగా ఉంటాడు. 22 గజాల పిచ్​ మధ్య అత్యంత వేగంగా పరుగు పెడుతుంటాడు. ఇంకో విషయం.. అతడిని ఆస్ట్రేలియా క్రికెటర్లు విరాట్​ ఆస్ట్రేలియన్​లా ఆడతాడు అని మెచ్చుకుంటుంటారు. నేటి తరం క్రికెట్​ ఆడేవాళ్లకు ఎప్పుడూ కోహ్లీనే స్ఫూర్తి. ఇంతకీ విరాట్​ కోహ్లీ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. విరాట్​ కోహ్లీ విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేశారు. అవునా అని ఆశ్చర్యపోతున్నారా! అది ఎక్కడుందో తెలుసా?

Virat Kohli Statue
విరాట్​ కోహ్లీ విగ్రహం (ETV Bharat)

కోహ్లీ విగ్రహం : ఖమ్మం నగరంలోని సర్దార్​ పటేల్​ స్టేడియంలో విరాట్​ కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కుర్చీలో కూర్చొని ఉన్న దిగ్గజ క్రికెటర్​ విరాట్​ కోహ్లీ, ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్​కు సిద్ధంగా ఉన్నట్లు ఈ బొమ్మ రూపం ఉంది. యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపేందుకు అక్కడి నిర్వాహకులు ఇలా కింగ్​ కోహ్లీ బొమ్మను ఏర్పాటు చేశారు. 12 కుర్చీలు ఉండగా, మొదటి వరుసలో ఓ సీటులో కోహ్లీ బొమ్మను సిద్ధం చేశారు. ఈ బొమ్మను శాశ్వతంగా అక్కడే ఉంచరు.

వారికి అవసరం అయినప్పుడు బొమ్మను తీసుకువచ్చి అక్కడ పెడతారు, మిగిలిన సందర్భాల్లో జాగ్రత్తగా తీసుకెళ్లి భద్రపరుస్తారు. జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతున్నప్పుడు విరాట్​ కోహ్లీ బొమ్మ రూపాన్ని సీటులో కూర్చోబెట్టి, అయిపోయిన తర్వాత తీసుకెళ్లి భద్రపరుస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే చిన్నారులు తమ ఆరాధ్య క్రికెటర్​ పక్కన నిల్చోని ఫొటోలు దిగి, తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

'10 ఏళ్ల నుంచి అది తినడమే మానేశాడు' - కోహ్లీ ఫిట్​నెస్​పై అనుష్క శర్మ!

ఆస్ట్రేలియాలోనూ 'కింగ్' మేనియా - న్యూస్​ పేపర్​ ఫ్రంట్ పేజీపై విరాట్​ స్పెషల్ కవరేజ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.