ETV Bharat / state

అమరావతిపై కక్ష- సీఆర్​డీఏ పరిధిని కుదించిన గత ప్రభుత్వం - CRDA Range Reduced

CRDA Range Reduced in During YSRCP Govt: అమరావతిపై కక్షగట్టి మరీ జగన్ సర్కార్ కుదించిన సీఆర్​డీఏ పరిధిని పునరుద్ధరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. గత ఐదేళ్లలో ఏకంగా 1,610 చదరపు కిలో మీటర్ల రాజధాని ప్రాంతాన్ని జగన్ కోత కోశారు. ఈ ప్రభావం రాజధానిపై తీవ్రంగా పడింది. జగన్ చేసిన విధ్వంసం నుంచి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను యథాపూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి వస్తోంది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 3:57 PM IST

CRDA_Range_Reduced_During_YSRCP_Govt
CRDA_Range_Reduced_During_YSRCP_Govt (ETV Bharat)

CRDA Range Reduced in During YSRCP Govt: ముందుచూపు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏపీకి రాజధానిగా గుంటూరు- విజయవాడ నగరాల మధ్య ప్రాంతాన్ని నాడు చంద్రబాబు ఎంపిక చేశారు. 2014 డిసెంబరులో సీఆర్​డీఏను ఏర్పాటు చేసి దీని పరిధిని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 8 వేల 603.32 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ అమరావతిపై కక్ష పెంచుకున్నారు.

3 రాజధానులు అంటూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ- సీఆర్​డీఏను సర్వ నాశనం చేశారు. దశలవారీగా సీఆర్​డీఏ పరిధిని జగన్‌ కసితీరా కుదించేశారు. పలు ప్రాంతాలను విడదీసి, ఇతర పట్టణాభివృద్ధి సంస్థలు, కార్పొరేషన్లలో విలీనం చేశారు. ఐదేళ్లలో 1,610 చదరపు కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతానికి కోత వేయడంతో సీఆర్​డీఏ పరిధి 6 వేల 993.24 చదరపు కిలో మీటర్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం 45 మండలాలు, 12 పట్టణాలకు పరిమితమైంది. రాజధాని ప్రాంతం నుంచి విడదీసిన గ్రామాలకు తీరని అన్యాయం జరిగింది.

సీఆర్​డీఏను నోటిఫై చేసినప్పుడు గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలను కలిపి రాజధాని నగరంగా గుర్తించింది. మూడేళ్ల క్రితం ఇందులోని ఉండవల్లి, నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, నిడమర్రు, పెనుమాక గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పాటు చేసిన మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్‌లో జగన్ ప్రభుత్వం విలీనం చేసింది. దీనిని రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. 29 గ్రామాలను ఒక్కటిగానే ఉంచాలని ప్రభుత్వానికి విన్నవించినా జగన్‌ బేఖాతరు చేస్తూ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.

కేంద్ర సంస్థలకు 'అమరావతి ఆహ్వానం' - పూర్వవైభవం దిశగా ప్రభుత్వం అడుగులు - Central Govt Offices in Amaravati

గతంలో సీఆర్​డీఏ పరిధిలో ఉన్న సత్తెనపల్లి, దాని చుట్టుపక్కల ఉన్న మండలాలను ఏడాదిన్నర క్రితం మళ్లీ నాటి ప్రభుత్వం విడదీసింది. పల్నాడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ- పడా పేరుతో కొత్తగా ఏర్పాటు చేసి, వెయ్యి 47.67 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఇందులో విలీనం చేసింది. సత్తెనపల్లి పట్టణం, గ్రామీణ మండలం, యడ్లపాడు, అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు, అమరావతి మండలాలను పూర్తిగా పడా పరిధిలోకి మార్చారు.

దీని వల్ల ఈ ప్రాంతాల్లో అభివృద్ధి స్తంభించింది. గతంలో సీఆర్​డీఏ నిధులు 12 కోట్ల రూపాయలతో సత్తెనపల్లిలో పాత రక్షిత చెరువును తారకరామసాగర్‌గా, పక్కనే ఉన్న వావిలాల సమాధి ప్రాంతాన్ని స్క్మృతివనం, పార్కులుగా అభివృద్ధి చేశారు. పర్యాటకంగా సత్తెనపల్లిలోని పాత చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సీఆర్​డీఏ నిధులు అక్కరకొచ్చాయి. ఆ స్థాయిలో నిధుల సమీకరణ పడాతో సాధ్యపడదు.

వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను 562.41 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సీఆర్డీఏ నుంచి విడగొట్టి బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ- బుడాలో విలీనం చేశారు. చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాలను బుడాలో కలిపారు. సీఆర్డీఏ పరిధిలో ఉంటే రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగం కావొచ్చు. కీలక ప్రాజెక్టులు ఈ ప్రాంతాలకు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. భూములు, స్థలాల ధరలు పెరగడం వల్ల స్థానికులకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది.

నెల రోజుల్లోగా రాజధాని ప్రాంతంలో పిచ్చి మొక్కలు తొలగించాలి - సీఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.