ETV Bharat / state

హైదరాబాద్​కు వచ్చేసిన కార్న్ పాలిమర్‌ - ఇక ప్లాస్టిక్​ను పక్కన పడేయొచ్చు

ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయంగా కార్న్ పాలిమర్ బ్యాగులు - హైదరాబాద్​లో పెరుగుతున్న బయో కార్న్ పాలిమర్ బ్యాగులు - నగరంలో లక్ష కేజీల బ్యాగుల విక్రయం

Corn Polymer Bags
Corn Polymer Bags (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 2:05 PM IST

Corn Polymer Bags : ప్లాస్టిక్​ ప్రస్తుతం భూగోళానికి పెను ప్రమాదంగా మారింది. దీన్ని నివారించడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయోగాలు చేసినా అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. రోజురోజుకూ దీని​ వాడకం పెరుగుతూనే ఉంది. ఇది భూతాపాన్ని పెంచడమే కాకుండా మానవాళికి, జంతు జాతికి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. అయితే ప్లాస్టిక్​ నుంచి పుడమిని రక్షించేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. వాటికన్నా మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్లాస్టిక్​ను ఎంత వేగంగా వాడటం మానేస్తామో అంత వేగంగా భూగోళాన్ని రక్షించిన వారిమవుతాం. ఇప్పుడు ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయంగా కార్న్ పాలిమర్​ వినియోగం వచ్చింది. ఇది సులభంలో భూమిలో కరిగే ప్లాస్టిక్ అన్నమాట.

ఇప్పుడు ఈ కార్న్​ పాలిమర్ వినియోగం హైదరాబాద్​ నగరమంతా క్రమంగా పెరుగుతోంది. ఈ కార్న్​ పాలిమర్​ను ఆసుపత్రులు, రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు ప్రతి నెలా సగటున ఒక్కో పరిశ్రమలో లక్ష కేజీల బ్యాగులు విక్రయం జరుగుతున్నాయని సమాచారం.

కానీ ఇక్కడే వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే ప్లాస్టిక్​ బ్యాగుల కన్నా ఈ కార్న్ పాలిమర్​ ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. అలాగే నగరంలో రోజూ ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలతో పోల్చితే 10 నుంచి 15 శాతం మాత్రమే కార్న్​ పాలిమర్ బ్యాగులు ఉండటం ఆందోళన కలిగిస్తున్నాయి. పాలిమర్ బ్యాగుల ఉత్పత్తి పెరిగితే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గే అవకాశం పుష్కలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

అసలు కార్న్​ పాలిమర్​ను ఎలా తయారు చేస్తారు :

  • మొక్కజొన్న పిండితో కార్న్​ పాలిమర్​ను తయారు చేస్తారు.
  • 180 రోజుల్లో భూమిలో కరిగిపోతుంది.
  • కేంద్ర వాయుష్య నియంత్రణ మండలి పలు దశల్లో పరీక్షలు నిర్వహించింది.
  • సర్టిఫై చేసి లైసెన్సు జారీ చేసిన తర్వాతే ఉత్పత్తి ప్రారంభం
  • జీడిమెట్లలో ఇప్పటికే పదుల సంఖ్యలో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పరిశ్రమలు ఏర్పాటు చేయగా విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి.
  • కాగితం, జ్యూట్, క్లాత్ బ్యాగుల కంటే కార్న్​ పాలిమర్ సంచుల వినియోగమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని పరిశ్రమల నిర్వాహకలు కోరుతున్నారు.

నిత్యం 700 టన్నుల వ్యర్థాలు : గ్రేటర్ పరిధిలో రోజూ సగటున 8 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఏటా 2,26,092 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నా.. ప్లాస్టిక్​ వ్యర్థాలకు రీసైక్లింగ్ వ్యవస్థ అనేది ఎక్కడా లేదు. ప్లాస్టిక్​ కవర్స్​ నిషేధం ఉన్నా కూరగాయల మార్కెట్లు, మాంసం, దుస్తులు, కిరాణా దుకాణాల్లో ప్లాస్టిక్​ క్యారీ బ్యాగ్​లను విరివిగా వాడుతున్నారు. ఇలా గ్రేటర్​ పరిధిలోనే కోటి క్యారీ బ్యాగ్​లు వినియోగిస్తున్నట్లు అంచనా. ఫలితంగా నిత్యం 700 మెట్రిక్​ టన్నుల ప్లాస్టిక్​ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయన్న మాట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.