Congress MP Candidates Selection Telangana 2024 : లోక్‌సభ టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్ల జాబితాను డీసీసీ అధ్యక్షులు పీసీసీకి పంపేందుకు విధించిన గడువు ఇవాళ్టితో ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ఈ సాయంత్రంలోపు నాయకుల పేర్లను డీసీసీ అధ్యక్షులు పీసీసీకి పంపాల్సి ఉంది. కానీ సాయంత్రం 6 గంటల వరకు కేవలం 20 మంది డీసీసీలు మాత్రమే గాంధీభవన్‌కు వివరాలు పంపినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరో పది మందికి పైగా డీసీసీ అధ్యక్షులు వివరాలు ఇవ్వాల్సి ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. అప్పటి వరకు డీసీసీల నుంచి వచ్చిన ఆశావహుల వివరాలను నియోజకవర్గాలు వారీగా ఓ జాబితాను సిద్ధం చేస్తారు. పీఈసీ కమిటీ ఛైర్మన్, పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీఈసీ సభ్యులు పాల్గొంటారు. రేపు జరగనున్న పీఈసీ సమావేశంలో డీసీసీలు పంపించిన పేర్లను నియోజకవర్గాల వారీగా పీఈసీ పరిశీలిస్తుంది.
Telangana Congress On Parliament Elections 2024 : అర్హులైన నాయకులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పీఈసీ సిఫారసు చేస్తుంది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పీఈసీ పంపిన పేర్ల జాబితాపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించి అర్హులైన, ప్రత్యర్థులైన బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను గట్టిగా ఎదురొడ్డి గెలవగలిగిన సత్తా ఉన్న గెలుపు గుర్రాలను సీఈసీ ఎంపిక చేస్తుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.
లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ
Congress Focus on Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ ముందస్తుగా వెలువడే అవకాశం ఉందనే ప్రచారంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తును మరింత ముమ్మరం చేసింది. అభ్యర్థులకు సంబంధించి అన్ని రాష్ట్రాల పీసీసీలు ప్రతిపాదనలు పంపాలన్న ఏఐసీసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి డీసీసీలకు సమాచారం అందించారు. ఈరోజు సాయంత్రం వరకు ఆశావహుల పేర్లు పీసీసీ వద్దకు చేరనున్నాయి. ఒక్కో స్థానంలో నలుగురైదుగురు నేతలు టిక్కెట్ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేలా పీసీసీ సిద్ధమవుతోంది. తాజా రాజకీయ పరిస్థితిని అంచనా వేసి క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులను సర్వేల ద్వారా గుర్తించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలపై తుది నిర్ణయం ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను ఎన్నికల సమయంలోగా అమలు చేయకపోతే లోక్‌సభ ఫలితాలపై ప్రభావం పడుతుందనే ఆలోచనలో హస్తం పార్టీ ఉంది. వాటి అమలు కోసం తీవ్ర కసరత్తు చేస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లే లక్ష్యంగా 'బీజేపీ క్లస్టర్ సమావేశాలు'
2024 లోక్‌సభ ఎన్నికలు- ఓటేసేందుకు 96 కోట్ల మందికిపైగా అర్హులు