Congress Ministers Foundation Stone For Redlakunta Lift Irrigation : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో, రూ.53 కోట్ల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ 47.64 కోట్ల వ్యయంతో రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్‌కు, రూ 5.30 కోట్ల వ్యయంతో శాంతినగర్ ఎత్తిపోతల పథకం(Shanti Nagar Lift Scheme) పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శాంతినగర్, రెడ్లకుంట గ్రామాల్లో పదివేల ఎకరాల వరకు పంటకు సాగు చేసే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దోచుకోవడం తప్ప మరే పని చేయలేదని మంత్రులు విమర్శించారు. నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తే తప్ప, ఇంత వేగంగా ఓ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టలేమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోపే ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశామని తెలిపారు. ఎన్నికలకు ముందు తన మెజార్టీపై ఉత్తమ్ కుమార్ సవాలు విసిరేవారని భట్టి గుర్తుచేశారు.
అందుబాటులో 25 ఎలక్ట్రిక్ టీఎస్ఆర్టీసీ బస్సులు - ప్రారంభించిన మంత్రులు
"ఈరోజు మేము చెప్పిన ప్రతీ గ్యారంటీలను అమలు చేసి చూపుతున్నాం. పథకాల అమలులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యం ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో పదేళ్లు బీఆర్‌ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా భ్రష్టు పట్టుపోయింది. దానిపై పూర్తిగా సమీక్షించి ప్రతిచోట నీరు పారేటట్టు చేసేలా మంత్రి ఉత్తమ్ తీసుకుంటారు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోపే ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరానికి కూడా నీరు ఇచ్చే విధంగా కార్యాచరణ చేస్తాం."-భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
అర్హులైన అందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు : కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు అన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 మంది నిరుపేదలకు గృహలక్ష్మి పథకం(Gruhalakshmi Scheme) ద్వారా ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల రూపాయలు అందివ్వనున్నట్టు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మార్చి ఒకటో తేదీ నుంచి తెలరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లులను మాఫీ చేయడం జరిగిందన్నారు.
ప్రజాప్రతినిధులుగా గెలిసిన మరుక్షణమే ఉత్తమ్ దంపతులు అభివృద్ధిపై దృష్టి పెట్టారని గుర్తు చేశారు. ఉత్తమ్ ఎన్నికల సమయంలో 50వేల మెజార్టీకి తగ్గకుండా సవాల్ చేయడం గొప్ప విషయమన్నారు. కోదాడలో పట్టణంలో రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు ముమ్మరం - కొనసాగుతోన్న ఫ్లాష్ సర్వేలు
బిల్లు వచ్చినవారు ఆ వివరాలతో మళ్లీ దరఖాస్తు చేయాలి - గృహజ్యోతిపై భట్టి క్లారిటీ