Congress Govt Gas Cylinder Scheme : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ఇందులో ఇప్పటికే రెండు హమీలను అమలు చేయగా, తాజా మరో రెండు హామీలైన మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహాజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేసింది. ఇందులో భాగంగా గ్యాస్ రాయితీ విషయంపై పౌర సరఫరాల శాఖ అర్హుల జాబితాకు సంబంధించిన విధి విధానాలను రూపొందించింది.
500 Rupees Gas Cylinder Scheme : సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితాను పౌర సరఫరాల శాఖ రూపొందించింది. సంవత్సరానికి ఎవరికి ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాలన్న విషయంపై లెక్కలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి (500 Rupees Gas Cylinder) అర్హులైన వారి మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ లెక్కన ఏటా గరిష్ఠంగా ఇవ్వాల్సిన సిలిండర్ల సంఖ్య 8గా తేలింది.
రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై క్లారిటీ వచ్చేసింది - ముందుగా మొత్తం ధర చెల్లించాలి, ఆ తర్వాత!
మహాలక్ష్మి పథకానికి కొద్దిరోజుల క్రితం 39.78 లక్షల మందిని అర్హులుగా పౌర సరఫరాల శాఖ అధికారులు తేల్చారు. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అర్హుల్లో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా సంవత్సరానికి 8 గ్యాస్ సిలిండర్ల చొప్పున వినియోగించారని పౌర సరఫరాల శాఖ తేల్చింది. దీంతో ఈ పథకంలో సబ్సిడీపై ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య గరిష్ఠంగా ఏడాదికి ఎనిమిదిగా నిర్ధారణ అయ్యింది.
మొత్తంగా రాష్ట్ర సర్కార్ భరించాల్సిన సబ్సిడీ నెలకు రూ.71.27 కోట్లు, సంవత్సరానికి రూ.855.2 కోట్లుగా తేలింది. ఇందులో ఉజ్వల కనెక్షన్ వినియోగదారులకు రూ.38.57 కోట్లు, సాధారణ గ్యాస్ కనెక్షన్‌దారులకు రూ.816.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌దారులు 11.58 లక్షల మంది ఉన్నా, సబ్సిడీ సిలిండర్ కోసం 5.89 లక్షల మంది మాత్రమే అర్జీ పెట్టుకున్నారు. ఉజ్వల గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్‌కు రూ.340 సబ్సిడీ (Gas Cylinder Scheme) ఇస్తుండటంతో వీటిపై తెలంగాణ సర్కార్ రూ.155 చొప్పున రాయితీ భరిస్తే సరిపోతుంది.
రూ.500కే గ్యాస్ సిలిండర్ - మూడేళ్ల సగటు లెక్క ప్రకారమే కసరత్తు!
మూలన పెట్టిన బండ మళ్లీ వినియోగంలోకి : మూడు సంవత్సరాల గ్యాస్ వాడకం లెక్కలు తీయగా, కొందరు అతి తక్కువగా గ్యాస్ వినియోగిస్తుంటే, మరికొందరు అసలు గ్యాస్ వాడడం లేదని తేలింది. గత మూడేళ్లలో సిలిండర్‌ను ఒక్కసారి కూడా తీసుకోని వినియోగదారుల సంఖ్య 1,10,706గా ఉంది. వీరిలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు 18,073 మంది కాగా, సాధారణ కనెక్షన్‌దారులు 92,633 మంది ఉన్నారు. ఇన్నాళ్లూ గ్యాస్ బండను వాడకుండా పక్కన పెట్టిన వీరంతా, ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
'మహాలక్ష్మి'కి గుడ్ న్యూస్ - రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం జీవో విడుదల
రూ.500కే గ్యాస్ సిలిండర్ - లబ్ధిదారుల ఖాతాలోకి రాయితీ నగదు బదిలీనే