ETV Bharat / state

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థ్విత్వం కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ - సోనియాగాంధీ బరిలో నిలిచేనా! - Congress Parliament Election 2024

Congress Focus On Parliament Election : రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న అధికార కాంగ్రెస్, ఆ దిశగా కసరత్తు మరింత ముమ్మరం చేస్తోంది. పార్లమెంట్ బరిలో నిలిచే ఆశావహ అభ్యర్థుల వివరాలను ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలించింది. ఖమ్మం లోక్​సభ స్థానం నుంచి పోటీకి 12 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా వీరిలో సరైన అభ్యర్థి ఎంపిక కోసం తీవ్ర కసరత్తు సాగిస్తోంది. ఖమ్మం బరిలో పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని రంగంలోకి దిగాలంటూ డిమాండ్లు వినిపిస్తుండగా, ఒకవేళ పార్టీ అధినేత్రి పోటీలో లేని పక్షంలో సీటు తమదంటే తమదంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది.

Congress Focus On Parliament Election
Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 10:49 AM IST

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థ్విత్వం కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ - సోనియాగాంధీ బరిలో నిలవాలని నాయకుల తీర్మానం

Congress Focus On Parliament Election : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించగా గాంధీ భవన్ వేదికగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(PCC Revanth Reddy) అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఆశావహుల వివరాలు పరిశీలించింది. 12 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఇప్పటికే జిల్లా పార్టీ తీర్మానించి రాష్ట్ర పార్టీకి ప్రతిపాదనలు పంపింది.

కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు: మంత్రి ఉత్తమ్‌

Congress Focus On Khammam Parliament Seat : ఖమ్మం బరిలో ఎవరు నిలుస్తారు, అధిష్టానం ఎవరి అభ్యర్థిత్వం ఖరారు చేస్తుందన్నది ఇప్ఫుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న అంశం. టికెట్ ఆశిస్తున్న వారిలో ముగ్గురి పేర్లతో పీఈసీ త్వరలోనే అధిష్ఠానానికి ప్రతిపాదించనుంది. పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, వి.హనుమంతరావు సీటు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల కుటుంబ సభ్యులు సైతం టికెట్ రేసులో ప్రధానంగా ఉన్నారు. ఏళ్లుగా పార్టీకి విధేయులుగా ఉన్న తమకు అవకాశం కల్పించాలంటూ రాయల నాగేశ్వరరావు, వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు, మద్ది శ్రీనివాస్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.

ఖమ్మం బరిలో సోనియా గాంధీ : ఎవరికి వారే టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. టికెట్ దక్కించుకుంటే చాలు సగం విజయం సాధించినట్టేనని నేతలు భావిస్తున్నారు. పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi) ఖమ్మం బరిలో నిలిస్తే ఆమె ఘనవిజయం సాధించేలా పనిచేస్తామని ఆశావహులంతా ప్రకటించారు. ఒకవేళ ఆమె పోటీలో లేని పక్షంలో తమకంటే తమకు సీటు కేటాయించాలని పార్టీ అగ్రనాయకత్వంపై ఒత్తిడి తీవ్రం చేస్తున్నారు.

కేసీఆర్​ సర్కార్​ అవినీతిని ఊరూరా చాటి చెప్పండి - పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్​రెడ్డి పిలుపు

Congress Parliament Election 2024 : ఈ పరిస్థితుల్లో టికెట్ ఆశిస్తూ డజను మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఐదుగురు నేతల మధ్యే ఉన్నట్లు కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా టికెట్ రేసులో మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల యుగంధర్, మల్లు నందిని, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పోటీపడుతున్నారు. ముగ్గురు మంత్రుల కుటుంబీకులు అభ్యర్థిత్వం ఆశించడం వల్ల ఎంపికలో పీఠముడి తప్పేలా లేదు. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి రాజకీయ అరంగేట్రం చేయాలని పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల యుగంధర్, మల్లు నందిని ఉవ్విళ్లూరుతున్నారు.

Congress : భారీ కాన్వాయ్‌తో ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మల్లు నందిని గాంధీభవన్‌కు వెళ్లారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో పొంగులేటికి అన్నీ తానై బాధ్యతలు నిర్వర్తించిన ప్రసాద్ రెడ్డి ఎంపీ బరిలో నిలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మంలో తుమ్మల ప్రచారం, ఎన్నికల ఎత్తుగడ, గెలుపులో కీలకపాత్ర పోషించిన తుమ్మల యుగంధర్ ఈ సారి ఎలాగైనా ఎన్నికల క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలను కుంటున్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొంటున్న యుగంధర్ తనకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం బరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

కాళేశ్వరంలో ఒక బ్యారేజీ కూలిపోయింది, మరొకటి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది: ఉత్తమ్

అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టారు : మంత్రి కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.