Complaint on Kodali Nani: అధికారాన్ని అడ్డుపెట్టుకుని గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన అరచకాలు బయటకు వస్తున్నాయి. గుడివాడలో ఏపీ బేవరేజెస్ గోడౌన్ విషయంలో అవినీతికి పాల్పడ్డారని పీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లా జెసి మాధవిలతపై గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి ఆధారాలతో సిఐడి సిట్ కు ఫిర్యాదు చేశారు. కాలపరిమితి ఉన్న కూడా గోడౌన్ ను ఎందుకు మారుస్తున్నారని తన తల్లి సీతామహాలక్ష్మి వాసుదేవరెడ్డి ప్రశ్నిస్తే ఆయన ఆసభ్యపరజాలంతో దూషించారని, ఆయన వ్యాఖ్యాలతో మనస్థాపన చెందిన తన తల్లి కొద్ది రోజులకే మరణించిందని ప్రభాకర్ అవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బహిరంగ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి ఏపీ బేవరేజెస్ గుడివాడ గోడౌన్ దక్కించుకున్నారని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోనగర్ లో గొడౌన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. 2019 వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు రెండేళ్లు కాల పరిమితి ఉన్న కారణం లేకుండా గోడౌన్ మార్చేందుకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి ప్రయత్నించాని ఆరోపించారు.
ఇదేమిటని అప్పటి కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డిని అడిగితే తమను దుర్భాషలాడారని,అప్పట్లో తమ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వైఎస్సార్సీపీ నేత దుక్కిపాటి శశి భూషణ్ ఫోన్లు చేసి బెదిరించారని వాపోయారు. కారణం లేకుండా ఎందుకు గోడౌన్ తన తల్లి సీతామహాలక్ష్మి 2020 మే నెలలో అడిగితే వాసుదేవ రెడ్డి ఆసభ్యపదజాలంతో దూషించారని, వాసుదేవరెడ్డి వ్యాఖ్యాలతో మనస్థాపన చెందిన తన తల్లి సీతామహాలక్ష్మి జూన్ నెలలో మరణించారని అవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో చదరపు అడుగు ఐదు రూపాయలు మాత్రమే ఉండాలని నిబంధనలో ఉండగా, లీస్ట్ టెండర్ దారులను పరిగణలోకి తీసుకోకుండా పద్మారెడ్డికి 9.99 పైసలకు టెండర్ ఖరారు చేశారని అన్నారు. లక్షలాది రూపాయల కార్పొరేషన్ సొమ్ము వైఎస్సార్సీపీ నేతలు తమ జేబుల్లోకి వేసుకున్నారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంలో పద్మారెడ్డి అల్లుడైన ఐఆర్ఎస్ అధికారి కర్రీ రామ్ గోపాల్ రెడ్డి కూడా భాగస్వామ్యం అయ్యి కార్పొరేషన్ సొమ్మును వాటాలుగా పంచుకున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, అప్పటి జేసి మాధవిలత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పద్మారెడ్డి, వైఎస్సార్సీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ లు చేసిన కుంభకోణంపై ఆధారాలతో సిఐడి సిట్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు.
నానిపై వాలంటీర్ కేసు- పార్టీ కార్యాలయంపై టీడీపీ జెండాలు - Police Case Register Against Nani