Committee on Temples in Telangana : రాష్ట్రంలోని చారిత్రక, పురాతన ఆలయాల మరమ్మతులు, పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ, ఆర్కియాలజీ శాఖలతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ఆలయాలు శిథిలావస్థలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిలో కొన్ని దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా, మరికొన్ని ఆర్కియాలజీ శాఖ అధీనంలో ఉన్నాయి. ఈ రెండు శాఖలు సమన్వయంగా పని చేసి ఆలయాల చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించాలని ప్రభుత్వం భావించింది.
ఇందుకు అనుగుణంగా రెండు శాఖలతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. సంయుక్త కమిటీ ఛైర్‌పర్సన్‌గా దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కన్వీనర్‌గా హెరిటేజ్, ఆర్కియాలజీ శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తారు. కమిటీ కో కన్వీనర్‌గా దేవదాయ శాఖ డైరెక్టర్, సభ్యుడిగా యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ సీఈవోగా జి.కిషన్ రావు, ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆర్కిటెక్ సత్యనారాయణ మూర్తిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో ఆలయాలకు అవసరమైన మరమ్మతులు, పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధిపై కమిటీ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది.
Famous Temples in Hyderabad : మీరు హైదరాబాద్‌లో తప్పక దర్శించుకోవాల్సిన 7 ప్రముఖ దేవాలయాలివే.!