CMO Serious on Minister Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాబోయే ఎన్నికల్లో టికెట్ కేటాయించే అంశంపై ఇంకా ఎదురుచూపు తప్పడం లేదు. అమర్నాథ్ ప్రాతినిధ్యం వహించే అనకాపల్లి నియోజకవర్గ టికెట్ ఇప్పటికే మరొక్కరికి కేటాయించారు. ఇక పోటీ చేసే అంశంపై అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలకు మంత్రి కొంత దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. బుధవారం పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన సమీక్షను సచివాలయంలో నిర్వహించారు. ఇన్నాళ్లూ మంత్రిగా తన సీటులో కూర్చొని సమీక్షలు నిర్వహించిన మంత్రి కన్ను ముఖ్యమంత్రి సీటుపై పడింది. ఇంకేముంది ముఖ్యమంత్రి కూర్చునే సీటులో కూర్చొని సమీక్ష చేపట్టారు.
సీరియస్ అయిన సీఎంవో: మంత్రి అమర్నాథ్ సీఎం కుర్చీపై కూర్చొవడంతో సీఎంఓ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సీఎం కుర్చీలో మంత్రి అమర్నాథ్ కూర్చోవడంపై సీఎంఓ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం ఛైర్లో కూర్చొని మంత్రి అమర్నాథ్ రివ్యూ చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో, ఆ వీడియోను టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఇదే అశంపై జీఏడీ అధికారులకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. మంత్రి గుడివాడ తీరుపై వైఎస్సార్సీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరి కొందరు మాత్రం సోషల్ మీడియాలో వ్యంగంగా స్పందిస్తున్నారు. పాపం మంత్రి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడేేమో అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఓటమి తప్పదు అని గ్రహించిన స్వంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవ్వరూ వైఎస్ జగన్‌ను ఖాతరు చెయ్యట్లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
"వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి.. ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత"
వీడియో షేర్ చేసిన ధూళిపాళ నరేంద్ర మంత్రి గుడివాడ అమర్‌నాద్ ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చుని కార్యక్రమం నిర్వహించారంటూ తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోటీకి సీటు ఇవ్వలేదని, సెక్రటేరియట్‌కు వెళ్లి ఏకంగా సీఎం సీట్లో కూర్చున్నాడంటూ ఎద్దేవా చేశారు. పాపం మంత్రి మాత్రం ఏం చేస్తాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ అంటే కేవలం చైర్ కాదన్న ధూళిపాళ్ల, అదొక హోదా అని గుర్తు చేశారు. వైకాపా నేతలకు ఇది అర్థం కాదని, వీళ్ల పోకడలకు అర్థం లేదని దుయ్యబట్టారు.
కంపెనీల ప్రతినిధులతో మంత్రి గుడివాడ భేటీ: బుధవారం సచ్చివాలయంలో పెట్టుబడులపై పలు కంపెనీలతో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిర్లా గ్రూప్, రిలయన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఎపీఐఐసీ, ఏపీ ఎంస్ఎంఈ కార్పొరేషన్లకు సంబంధించిన ప్రాజెక్టులకు మంత్రి అమర్ నాథ్ వర్చువల్‌గా భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం పేషీలోని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొవడం వైరల్‌గా మారింది.
Gudivada Amarnath: జనసేనకు గుడివాడ అమర్నాథ్ సవాల్... ఏమనంటే..?