ETV Bharat / state

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం - క్యాబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్ష నియామకం తాత్కాలిక వాయిదా! - CM Revanth on Cabinet Expansion - CM REVANTH ON CABINET EXPANSION

Telangana Cabinet Expansion Update : తెలంగాణ క్యాబినెట్ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్ష నియామక ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. కీలక నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం.

CM Revanth on Cabinet expansion
Revanth Reddy Visit Delhi Today (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 3:03 PM IST

Updated : Jul 3, 2024, 7:41 PM IST

Telangana Cabinet Expansion Temporarily Postponed : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ ప్రెసిడెంట్​ నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం.

వారం, పది రోజుల తర్వాత దీనిపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పీసీసీ నియామకంలో బీసీలకు అవకాశం కల్పించాలని ఒక అభిప్రాయానికి వచ్చినా, ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి కొంత సమయం పడుతుందని నేతలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం వేచి చూసి ఆ తరువాత చర్చించడం మంచిదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

కేబినెట్ విస్తరణపైన మరోసారి చర్చిస్తామన్న కాంగ్రెస్‌ నేతలు : ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు నియామకం, క్యాబినెట్ విస్తరణపై కసరత్తు కొలిక్కిరాలేదని భేటీకి హాజరైన నేతలు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల సమక్షంలో జరిగిన ఈ కీలక భేటీలోను ఏకాభిప్రాయం కుదరలేదన్నారు.

తమ అభిప్రాయాలను అధిష్ఠానం అడిగి తెలిసుకున్నట్లు నేతలు వివరించారు. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియ వాయిదా పడ్డట్లు, మరోమారు నేతలతో చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అగ్రనేతల పరస్పర అంగీకారం అనంతరం పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పీసీసీ చీఫ్​ నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ! : పీసీసీ ప్రెసిడెంట్​ పదవి కోసం ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, సురేశ్‌ షెట్కర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీతక్కలు సైతం అధ్యక్ష పదవిని అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్​ నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Rajya Sabha MP KK Joined in Congress : మరోపక్క, ఇవాళ సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమక్షంలో ఎంపీ కేకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. కేకే కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి గతంలో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్​ కండువా కప్పుకున్న కేకే - దిల్లీలో ఖర్గే సమక్షంలో చేరిక - KK Join in Congress Party

త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క - DY CM Bhatti On New PCC Chief

Last Updated : Jul 3, 2024, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.