ETV Bharat / state

హైదరాబాద్​లోని చారిత్రక కట్టడాలన్నీ కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక : సీఎం రేవంత్ - Musi Development program

CM Revanth Review on Musi Development : మూసీ నది ప్రక్షాళనను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక చేయాలని తెలిపారు. అధికారులు పని విభజన చేసుకొని మూసీ పరీవాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Musi Development program
CM Revanth Review on Musi Development
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 5:55 PM IST

Updated : Feb 20, 2024, 7:55 AM IST

హైదరాబాద్​లోని చారిత్రక కట్టడాలన్నీ కలుపుతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక సీఎం రేవంత్

CM Revanth Review on Musi Development : హైదరాబాద్​లోని చారిత్రక కట్టడాలన్నీ కలుపతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు సూచించారు. పెట్టుబడులని ఆకర్షించే స్థాయిలో అభివృద్ధి చేయాలని పర్యాటకంగా, ఆహ్లాదకరమైన ఉద్యానంగా మార్చాలని నిర్దేశించారు. మూసీ నది పరీవాహక అభివృద్ధిపై హైదరాబాద్​ నానక్​రాంగూడ హెచ్​ఎండీఏ(HMDA) కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు దానకిశోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.

మూసీ(Musi River) సరిహద్దు ప్రాంత స్కెచ్​తో పాటు పలు వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ప్రస్తుత రెవెన్యూ రికార్డుల్లోని గ్రామపటాలు, గరిష్ఠ వరద ప్రవాహం రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. హద్దులను పక్కాగా గుర్తించడం, నదీ గర్భంలోని వ్యర్థాల తొలగింపు, ఇతరత్రా పనులు చేపట్టడం తదితర చర్యలపై కూలంకషంగా చర్చించారు.

హైదరాబాద్​ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్​ - మూసీ నది అభివృద్ధే ప్రధానం

CM Revanth Reddy Review at HMDA : తొలుత మూసీ శుభ్రత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్​ రెడ్డి అధికారులకు ఆదేశించారు. నిరంతరం మంచినీరు పారించడం కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్​లో చక్కు మురుగైనా కలకుండా చూడాలని సూచించారు. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ద్వారా వస్తున్న జలాలనే సమూసీలోకి మళ్లించడం, ఎగువ నుంచి నదిలోకి మంచినీరు వచ్చేలా రివర్​ లింక్డు ప్రాజెక్టుపైనా దృష్టి పెట్టాలన్నారు. సాధ్యాసాధ్యాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని తెలిపారు.

నదిరూపు మార్చేందుకు అవసరమైతే డ్రోన్లతో సర్వే చేసి ఎక్కడెక్కడ, ఎంతమేర వ్యర్థాలున్నాయో తేల్చాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. అక్రమణలు, పరీవాహక ప్రాంతాల్లో ప్రస్తుతం నివసిస్తున్న కుటుంబాల గుర్తింపునకు అదనపు సిబ్బంది నియమించి వారికి పని విభజన చేసి త్వరితగతిన ప్రాజెక్టు(Musi River Projects) ముందుకు కదిలేలా చూడాలని అన్నారు. నిర్వాసితులకు పునరావాసం, ఆక్రమణల తొలగింపులో తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధానంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధికారులకు ఆదేశించారు.

Chinna Jeeyar Swamy Meet CM Revanth Reddy : అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) కలిశారు. సమత కుంభే పేరుతో నిర్వహించనున్న రామానుజాచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డిని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజ జీవిత విశేషాలను సీఎంకు చినజీయర్ స్వామి వివరించారు.

మూసీ సుందరీకరణపై కాంగ్రెస్ ఫోకస్ - నదీ కారిడార్‌ వెంట రోడ్‌ కమ్‌ మెట్రో రైలు మార్గం!

మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లు కేటాయింపు

Last Updated : Feb 20, 2024, 7:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.