ETV Bharat / state

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భవన నిర్మాణ అనుమతులపై విజిలెన్స్ విచారణ : సీఎం రేవంత్​ - CM Revanth Reddy Review

CM Revanth Reddy Review on GHMC : జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భవన నిర్మాణ అనుమతులపై విజిలెన్స్ విచారణ జరపనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్​లను, మున్సిపాలిటీలకు గ్రూప్ 1 అధికారులను కమిషనర్లుగా నియమించాలని సీఎం తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్​కు వచ్చే 50 ఏళ్లకు మంచినీటి అవసరాలపై ప్రణాళికలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో రైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Review on GHMC
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 1:58 PM IST

CM Revanth Reddy Review on GHMC : జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భవన నిర్మాణాలకు ఇష్టం వచ్చినట్టుగా అనుమతులు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసహనం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన చాలా ఫైళ్లు క‌నిపించ‌డం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్​లో లేకుండా ఇష్టారీతిగా అనుమతులు ఇచ్చారన్నారు. హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయని సీఎం స్పష్టం చేశారు. హెచ్​ఎండీఏ(HMDA) కార్యాలయంలో పురపాలక, జీహెచ్​ఎంసీ, జలమండలిపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సుమారు నాలుగు గంటల పాటు సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇంటికిపోతారని ఆయన అన్నారు. భవన నిర్మాణ అనుమతుల ఫైళ్లు క్లియర్​గా ఉండాల్సిందేనని ఆన్‌లైన్‌లో లేని వాటి జాబితా త‌యారు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల వివరాలు ఎందుకు తొలగిస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. దాదాపు 3,500 చెరువల డేటా ఆన్​లైన్​లో ఉండాల్సిందేనని ఆదేశించారు. ఆక్రమణ కాకుండా చెరువుల వద్ద వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

CM Revanth Fires on GHMC Officers : ఉదయాన్నే కాలనీల్లో పర్యటించని జీహెచ్​ఎంసీ(GHMC) జోనల్​ కమిషనర్లు ఇంటికి వెళ్లిపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి వ్యాఖ్యానించారు. కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే వేరే ఇస్తామని అన్నారు. న్యూయార్క్​ టైమ్​ స్క్వేర్​ తరహాలో హైదరాబాద్​లో వీడియో ప్రకటన బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టీ యుటిలిటీ టవర్స్​ను ఏర్పాటు చేయాలన్నారు. వీధి దీపాల వ్యవస్థ మెరుగుపరచాలని చెప్పారు. హైదరాబాద్​లో పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. నగరంలో ప్రైవేటు సెక్టార్​లో మల్టీ లెవెల్​ పార్కింగ్​ ఏర్పాటుకు సీఎం రేవంత్​ సూచించారు.

ఇంకా యుద్ధం ముగియలేదు - ఇది విరామం మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

జలమండలిపై సీఎం సమీక్ష :

  • స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని సూచ‌న‌.
  • హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశాలు.
  • మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌ణాళిక ర‌చించాల‌ని ఆదేశం.
  • వ‌చ్చే 50 ఏళ్ల తాగు నీటి అవ‌స‌రాల కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని అధికారుల‌కు సూచించిన సీఎం.
  • ఔట‌ర్ రింగు రోడ్డు బ‌య‌ట ఉన్న చెరువుల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించాల‌ని సూచ‌న‌.
  • హైద‌రాబాద్‌లో విలువైన ప్ర‌భుత్వ ఆస్తుల జాబితాను ప్ర‌భుత్వానికి సమర్పించాలి.
  • హైద‌రాబాద్‌లో ఏవైనా ప్రారంభోత్స‌వాలు ఉంటే వారం రోజుల్లో పెట్టుకోవాలి.
  • మెట్రో కొత్త మార్గాల‌కు త్వ‌ర‌లో శంకుస్థాప‌న.

జీహెచ్​ఎంసీలో వయసు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం : రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డిన 85 మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చ‌ర్యం వ్యక్తం చేశారు. కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్​లను, మున్సిపాలిటీలకు గ్రూప్​ 1 అధికారులను కమిషనర్​లుగా నియమించాలని సీఎం తెలిపారు. మున్సిపల్​ కార్మికులకు ప్రమాద బీమా(Bhema)పై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆస్తి పన్ను మదింపు కోసం డ్రోన్​ కెమెరాలను ఉపయోగించేందుకు అధ్యయనం చేయాలని ఆదేశించారు. జీహెచ్​ఎంసీలో వయసు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రులు - పనుల పురోగతిపై ఆరా

ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై నేడు కీలక సమావేశం - ఆ కమిటీతో సీఎం రేవంత్‌ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.