ETV Bharat / state

ఎంబీబీఎస్ స్టూడెంట్ సాయిశ్రద్ధకు సర్కార్ సాయం - ఆర్థికసాయం అందించిన సీఎం రేవంత్‌రెడ్డి

సాయిశ్రద్ద కల నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్న సీఎం- ఎంబీబీఎస్ సీటు సాధించినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాయిశ్రద్ధ - రేవంత్​ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన సాయిశ్రద్ధ, కుటుంబ సభ్యులు

MEDICO STUDENT SAI SHRADDHA
CM REVANTH REDDY HELP TO SAI SHRADDHA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2024, 5:59 PM IST

CM Revanth Help to Medical Student : ఎంబీబీఎస్​లో సీటు సాధించినప్పటికీ ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న గిరిజన విద్యార్థినికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఫీజుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందచేశారు. ఆమె ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. ప్రజలకు సేవలందించే డాక్టరు కావాలనే ఆశయంతో కష్టపడి చదివింది. జీవితంలో పెట్టుకున్న దిశగా లక్ష్యాన్ని సాధించింది. ఆ సందర్భంలో తన తల్లిదండ్రుల కళ్లు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి.

కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన సాయిశ్రద్ధ నీట్​లో మెడిసిన్ సీటు సాధించినా, ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి రావడంతో పిలిపించి ఆర్థిక సాయం చేశారు. డాక్టర్ కావాలన్న సాయిశ్రద్ధ కల నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాయిశ్రద్ధ, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందన : సాయిశ్రద్ధ ఓ వీడియోలో మాట్లాడుతూ ఈనాడు, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని అన్నారు. మా మారుమూల ప్రాంతానికి సంబంధించిన వార్తను చూసి భరోసా కల్పించడం సంతోషంగా ఉందన్నారు. తన లాంటి వెనుక బడిన ఎంతోమంది విద్యార్థులకు కూడా ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మెస్రం జ్ఞానేశ్వర్, లక్ష్మీలు సాయిశ్రద్ధ తల్లిదండ్రులు. వీరికి సొంతిల్లు కూడా లేదు. జ్ఞానేశ్వర్‌ స్థానికంగా వారి గ్రామంలోనే టైలర్​గా పని చేస్తున్నారు. కుమారుడు శుభం బీటెక్‌ చదివి గేట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. కుమార్తె సాయిశ్రద్ధ నార్నూర్‌ మండలంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది. ప్రభుత్వ కార్పొరేట్‌ పథకం సాయంతో వరంగల్‌లో ఇంటర్‌ పూర్తి చేసింది. ఎలాగైనా డాక్టరు కావాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివి నీట్‌లో ఎస్టీ రిజర్వేషన్ విభాగంలో 103వ ర్యాంకు సాధించింది. కౌన్సెలింగ్‌లో మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో సీటు పొంది, తన కలను సాకారం చేసుకుంది.

'మీరు తలో చేయి వేస్తే - నేను 'శ్రద్ధ'గా చదువుకుని డాక్టర్ అవుతా'

KTR Help : మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.