CM Revanth On NSS Volunteers : సమాజంలో పెడదోరణులకు పలు కారణాలున్నాయని వాటిలో మాదక ద్రవ్యాలు కూడా ఒకటని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్‌ను నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా డీజీపీ స్థాయి ఉన్నతాధికారితో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపుతున్నామని రేవంత్ వెల్లడించారు. నేర నిర్మూలన కేవలం పోలీసుల వల్లనే కాదని పౌరసమాజం సైతం తోడ్పాడునందించాలని సీఎం సూచించారు.
CM Revanth On Student Policing : మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, వాహనాల క్రమబద్ధీకరణకు ఎన్‌ఎస్ఎస్ వాలంటీర్లు సహకరించడానికి ముందుకు రావడం ఎంతో అభినందించదగిన విషయమని రేవంత్ రెడ్డి అన్నారు. కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్‌తో కలిసి సీఎం ప్రారంభించారు.
ఇంటర్నెట్తో జాగ్రత్త : పిల్లలను అంతర్జాలానికి దూరంగా ఉంచాలని సాంకేతికత వల్ల ఎంత ప్రయోజనం ఉందో సరైన పద్ధతిలో వాడుకోకపోవడం వల్ల అంతకంటే పెద్ద అనర్థాలు జరుగుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల పిల్లలకు మానవీయ విలువలు తెలియడంలేదని ప్రతి చిన్న విషయానికి మానసిక స్థైర్యం కోల్పోయి కొన్నిసార్లు ఆత్మహత్యలకు సైతం వెనుకాడటంలేని అన్నారు. యూనిఫాం లేని పోలీసులు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు అని మోరల్ పోలీసింగ్ చేయాల్సిన బాధ్యత వారిదేనని వ్యాఖ్యానించారు.
మాదక ద్రవ్యాలను పారద్రోలడమే లక్ష్యం : విద్యార్థులే డ్రగ్స్‌కు బానిసైతే సమాజం ఏం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను దృఢంగా తీర్చిదిద్దడంలో ఎన్‌ఎస్‌ఎస్ లాంటి కార్యక్రమాలు తోడ్పడుతాయని పేర్కొన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అంశాల్లో మాదకద్రవ్యాలు ఒకటని రాష్ట్రం నుంచి వీటిని పారదోలడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ అమలు చేస్తున్నారని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మాదక ద్రవ్యాల విక్రేతలపై గట్టి నిఘా పెట్టామని ఏదైనా సమాచారం వస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని డీజీపీ జితేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, జేఎన్టీయూ వీసీ బుర్రా వెంకటేశం, సీపీలు శ్రీనివాసరెడ్డి, అవినాష్, సుధీర్‌బాబు పాల్గొన్నారు.
"స్కూల్, కాలేజ్ యజమానులను పిలిపించి మేనేజ్మెంట్లతో కూడా మాట్లాడాం. సబ్జెక్టులను నేర్పించడం కాదు. మోరల్ పోలీసింగ్ నేర్పించండి. పిల్లల ప్రవర్తనలో మార్పులు వచ్చినపుడు మీరు వారిని నిశితంగా గమనించాలని చెప్పడం జరిగింది. ఇళ్ల దగ్గర, కళాశాలలోనో ఎక్కడైనా మీరు డ్రగ్స్‌ను గమనిస్తే వెంటనే పొలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాజంతో పాటు విద్యార్థులందరి భాగస్వామ్యంతోనే మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేయగలం"- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ : ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్?