ETV Bharat / state

డీకే అరుణ రాష్ట్రప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు : సీఎం రేవంత్‌ - CM Revanth Redddy Election Campaign

CM Revanth Corner Meeting in Mahabubnagar : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉండొద్దని దిల్లీ నుంచి వచ్చినవారు చూస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్‌లోని కొత్తకోట వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

CM Revanth Corner Meeting in Mahabubnagar
CM Revanth Corner Meeting in Mahabubnagar (etv bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 7:19 PM IST

Updated : May 4, 2024, 8:43 PM IST

CM Revanth Redddy Election Campaign in Mahabubnagar : మీ అభిమానం చూస్తుంటే తన హృదయం తన్మయం చెందుతోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. 40 ఏళ్ల నుంచి కొత్తకోటతో నాకు అనుబంధం ఉందన్నారు. గతంలో చిన్నారెడ్డి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తాను గోడలపై రాతలు రాశానని గుర్తు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14కు గానూ 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు లక్ష మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లోని కొత్తకోట వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

పదమూడేళ్ల వయసులో వనపర్తికి ఏడో తరగతి చదివేందుకు వచ్చానని, ఏడో తరగతి చదివేటప్పటి నుంచి నాకు వనపర్తితో అనుబంధం ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉండొద్దని దిల్లీ నుంచి వచ్చినవారు చూస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. డీకే అరుణకు కాంగ్రెస్‌ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌ రెడ్డిని ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు ముఖ్యమంత్రిని చేసిందన్నారు. వంశీచంద్‌ రెడ్డిని గెలిపిస్తే పాలమూరు జిల్లాకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని చిన్నారెడ్డికి చెప్పానని వివరించారు.

వ్యాపారాలు, పదవుల కోసం మాత్రమే డీకే అరుణ ముందు ఉంటారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధికి డీకే అరుణ ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌ షా అండతో తనపై దిల్లీలో కేసు పెట్టించారన్నారు. బీజేపీ రిజర్వేషన్ల రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని తాను చెప్పానని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను ఎడారి చేయాలని చాలామంది చూస్తున్నారని ధ్వజమెత్తారు. డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు.

'అరుణమ్మా కాంగ్రెస్‌ నీకు ఏం అన్యాయం చేసింది? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యేగా చేసినందుకా? ఉమ్మడి రాష్ట్రంలో నిన్ను మంత్రిగా చేసినందుకా? అరుణమ్మకు ఇంతపేరు తెచ్చి పెట్టింది కాంగ్రెస్‌ కాదా? మోదీ చేతిలో చురకత్తివై నీకు ఇంత చేసిన కాంగ్రెస్‌ను కడుపులో పొడవాలని చూస్తున్నావా? ఎంతో గొప్ప అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలని నేను అడగడం తప్పా? ఇది నేరమా? మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం దిల్లీలో మాట్లాడేవారు ఉండాలంటే వంశీ గెలవాలి. ముదిరాజ్‌ సోదరులను బీసీ డీ నుంచి ఏగా మార్చేందుకు సుప్రీంకోర్టులో సమస్యలు పరిష్కరించేందుకు వంశీ గెలవాలి. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు వంశీ చంద్‌ రెడ్డి ఎంపీగా గెలవాలని' సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

"తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయి 150 రోజులు కానేకాలేదు ఈరోజు నీవు దిగిపో అంటున్నారు. కొంత మంది దిల్లీ నుంచి గొడ్డళ్లు వేసుకొని బయలుదేరారు. శత్రువు పంచన చేరి ఈరోజు మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు. రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేయడానికి దిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చారు. రేవంత్‌ రెడ్డిని లోపల వేసైనా సరే రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ వాళ్లు అంటున్నారు." - రేవంత్‌ రెడ్డి, సీఎం

డీకే అరుణ రాష్ట్రప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు : సీఎం రేవంత్‌ (etv bharat)

ఆరునూరైనా మెదక్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి : సీఎం రేవంత్ - CM Revanth Road Show at Siddipet

కేసీఆర్‌ పిట్టల దొరలా ఏదేదో మాట్లాడుతున్నారు - పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాం : సీఎం రేవంత్‌ రెడ్డి - Lok Sabha Nominations In Telangana

Last Updated : May 4, 2024, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.