ETV Bharat / state

పెండింగ్‌లో 1.36 లక్షల ధరణి దరఖాస్తులు - ఈనెల 15లోపు పరిష్కారం కష్టమే! - Dharani Applications Process Delay

Dharani Portal Issues in Telangana : రాష్ట్రంలో ధరణి అప్లికేషన్ల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈనెల15వ తేదీ లోపల ధరణి దరఖాస్తుల పరిష్కారం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు అమలయ్యేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ 1.36 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

CM Revanth Orders Implementation difficult
Govt Officials Not Interested Solve Dharani Issues (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 9:19 AM IST

Dharani Application Settlement Process Delay : రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి అమలులోకి వచ్చినప్పటి నుంచి పెండింగ్​లో రెండున్నర లక్షల ధరణి సమస్యలు ఉన్నాయి. కొత్తగా ఈ ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ద్వారా మరో లక్ష దరఖాస్తుల వరకు అందాయి.

ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఆలస్యం - ఈనెల 15లోపు పరిష్కరించాలన్న సీఎం ఆదేశాలు అమలు కష్టమే! (ETV Bharat)

జులై 16వ తేదీన కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. అంతకముందు కూడా రెండుసార్లు ధరణి సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఏళ్ల తరబడి కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా భూ సమస్యలు పరిష్కారం కాలేదని అప్పట్లో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పరిష్కారానికి కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన, ఆగస్టు 15వ తేదీ నాటికి పరిష్కరించాలని ఆదేశించారు.

Govt Officials Not Interested Solve Dharani Issues : ఇప్పటికే రైతులు చేసుకున్న దరఖాస్తుల్లో వారి వద్ద ఉన్న ఆధారాలు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సరైనవి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ సమస్యలను పరిష్కారం చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. మండల స్థాయిలో దరఖాస్తుకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులను తహశీల్దార్లకు నివేదిస్తారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మరికొందరు సీఎం ఆదేశాలను కూడా పట్టించుకుంటున్న పరిస్థితులు కనిపించలేదు. సమస్యల పరిష్కారానికి అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం, కొత్తగా వస్తున్న భూ సమస్యల పరిష్కారానికి వస్తున్న దరఖాస్తులను చూసినట్లయితే ఇప్పట్లో పరిష్కారం అయ్యే అవకాశం కనిపించడం లేదు.

ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న 1.36 లక్షల ధరణి దరఖాస్తులు : రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో ఇప్పటికీ దాదాపు 1.36 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో తహశీల్దార్ల వద్ద దాదాపు 43,000 , ఆర్డీవోల వద్ద 29,977, అదనపు కలెక్టర్ల వద్ద 37,164, కలెక్టర్ల వద్ద 26,259 పరిష్కారం కావాల్సిన పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో 28,498, వికారాబాద్ కలెక్టరేట్ పరిధిలో 10,980, సంగారెడ్డి జిల్లాలో 10,943, నల్గొండ జిల్లాలో 7702, యాదాద్రి భువనగిరిలో 5,648, ఖమ్మంలో 5,584, నాగర్ కర్నూల్‌లో 5,544 లెక్కన అత్యధికంగా ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో ప్రతిరోజు వెయ్యికిపైగా భూ సమస్యలు పరిష్కారం అవుతుండగా దాదాపు 600 వరకు కొత్తగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులకు వస్తున్నాయి. కలెక్టర్లు అందరూ ఈ భూ సమస్యల పరిష్కారం వెైపు మరింత చొరవ చూపితే ప్రక్రియ వేగవంతం అవుతుంది. కొత్తగా వస్తున్న భూ సమస్యల దరఖాస్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు కలెక్టర్లు కూడా భూ సమస్యల పరిష్కార విషయంలో జాప్యం చేస్తుండడం వల్లనే ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాదా బైనామా భూ సమస్యలకు సంబంధించి కొత్త ఆర్వోఆర్‌ చట్టం వచ్చిన తర్వాతే పరిష్కారం లభిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ధరణి ద్వారా మళ్లీ భూస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు : కోదండరెడ్డి - Kodanda Reddy on BRS

ధరణి కొత్త బిల్లుపై ప్రజాభిప్రాయం - సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఇదే వెబ్​సైట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.