CM Revanth Reddy Seoul Tour Updates Today : రాష్ట్ర అభివృద్ధే నినాదంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటన సాగుతోంది. 8రోజుల పాటు అమెరికాలో పర్యటించి వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న బృందం, తాజాగా దక్షిణకొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో మెగా కారు టెస్ట్ సెంటర్‌ను స్థాపించేందుకు కంపెనీ ఆసక్తి చూపినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
సియోల్‌లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. భారతీయ వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హ్యుందాయ్ ప్రతినిధులు తెలిపారు. హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ హెచ్ఎంఐఈ ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థతో తెలంగాణలో వ్యాపారం చేసేందుకు హెచ్ఎంఐఈ వంటి అత్యుత్తమ కంపెనీలు ముందుకు వస్తున్నాయని సీఎం తెలిపారు. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు.
Pitched the Mega Textile Park in #Warangal as an ideal destination for further investments from Korean textiles companies at a business roundtable organised by #KOFOTI (Korea Federation of Textile Industry).
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2024
The gathering, including Mr Kihak Sung, Chairman, Youngone, Mr Soyoung… pic.twitter.com/xdHt9LpSE2
టెక్స్‌టైల్ ప్రతినిధులతో భేటీ : వరంగల్ టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తంచేశాయి. కొరియా పర్యటనలో భాగంగా బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ కాకతీయ మెగాటెక్స్ టైల్ పార్కులో పెట్టుబడి పెట్టాలని కోరారు. టెక్స్ టైల్ రంగం విస్తృతికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ, స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు.
యంగాన్ కార్పొరేషన్, కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ సహా 25 అగ్రశ్రేణి టెక్స్ టైల్ కంపెనీల అధినేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి పిలుపునకు కొరియా టెక్స్ టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది.
Good morning from Korea. Delighted to share with all of you that our Korean tour started off on a very positive note. We started our day with wide ranging conversations with one of Korea’s biggest industrial conglomerates - the LS Corp, which was formerly a part of the LG group.… pic.twitter.com/MlrgpiSk5g
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2024
CM Revanth Reddy Meet With LS Group Chairman : అంతకుముందు కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన LS గ్రూప్ ఛైర్మన్‌తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ వ్యవస్థాపకులైన, LS గ్రూపు కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభంకావడంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో పెట్టుబడుల విస్తరణకు LS గ్రూప్ ఆసక్తి కనబర్చినట్లు పేర్కొన్నారు.