ETV Bharat / state

బీజేపీకి షాక్​ - జితేందర్​రెడ్డిని కలిసిన సీఎం రేవంత్​ రెడ్డి - Revanth Reddy Meets Jithendar Reddy

CM Revanth Reddy Meets BJP Jithender Reddy : ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బీజేపీ నేత జితేందర్​రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు ప్రకటించడంతో పార్టీ అధిష్టానంపై జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జితేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం.

Revanth Reddy Meets BJP Jithender Reddy
CM Revanth Reddy Meets BJP Jithender Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 3:19 PM IST

CM Revanth Reddy Meets BJP Jithender Reddy : బీజేపీ నేత జితేందర్​రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy) , ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డితో కలిసి ఆయన నివాసానికి వెళ్లారు. కాగా జితేందర్ ​రెడ్డి మహబూబ్​నగర్​ టికెట్​ ఆశించారు ఆ స్థానంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు (DK Aruna) టికెట్​ ఇవ్వడంతో అసంతృప్తి చెందారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే లోక్‌సభ ఎన్నికల ముందే హస్తం కండువా కప్పుకునే (Congress Joinings) అవకాశం ఉందని రాజకీయవర్గాల విశ్లేషణగా ఉంది.

BJP Jithender Reddy May Joins in Congress : లోక్​సభ ఎన్నికల సమయంలో (Lok Sabha Elections 2024) వలస రాజకీయాలు జోరందుకున్నాయి. ఆశించిన వారికి టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇతర పార్టీలతో టికెట్ గురించి పక్కగా మంతనాలు జరిపిన తర్వాతే ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అలా వెళ్లిన చాలామంది నాయకులకు ఆయా పార్టీలు టికెట్లు ఇచ్చాయి.

బీజేపీకి షాక్​ జితేందర్​రెడ్డిని కలిసిన సీఎం రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.