ETV Bharat / state

మూసీని అడ్డంపెట్టుకుని ఎంతకాలం బతుకుతారు - హైదరాబాద్​లో మీ భరతం పడతా : సీఎం రేవంత్​ రెడ్డి - Telangana Family Digital Cards - TELANGANA FAMILY DIGITAL CARDS

Telangana Family Digital Cards Programme : రేషన్​ కార్డు కోసం పదేళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్​ అధికారంలో ఉంటే రేషన్​కార్డు రాదని, తమకు అధికారం ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్​ కార్డులు అవసరమని వివరించారు. ప్రతి పేదవాడికి కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్​లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్​ కార్డుల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు.

cm revanth program
cm revanth program (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 12:58 PM IST

Updated : Oct 3, 2024, 2:16 PM IST

Family Digital Card Program in Secunderabad : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కుటుంబ డిజిటల్​ కార్డు ఇవ్వాలని ఆలోచించామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్​లో కుటుంబ డిజిటల్​ కార్డుల కార్యక్రమాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. ఒకే రాష్ట్రం-ఒకే కార్డు పేరిట పైలట్​ ప్రాజెక్టు కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి, కలెక్టర్​ అనుదీప్​, జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఆమ్రపాలి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, 'రేషన్​ కార్డు కోసం పదేళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. కేసీఆర్​ అధికారంలో ఉంటే రేషన్​కార్డు రాదని మాకు అధికారం ఇచ్చారు. కొత్తగా రేషన్​కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్​ కార్డులు అవసరం. ప్రతి పేదవాడికి కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నాం. ఫ్యామిలీ డిజిటల్​ కార్డు కుటుంబానికి రక్షణ కవచం. డిజిటల్​ కార్డులో కుటుంబానికి సంబంధించిన వివరాలు ఉంటాయి.' అని తెలిపారు.

ఫ్యామిలీ కార్డు ఉంటే రేషన్​ ఎక్కడైనా తీసుకోవచ్చు : ఫ్యామిలీ కార్డు ఉంటే చాలు రేషన్​ ఎక్కడైనా తీసుకోవచ్చని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. ఫ్యామిలీ డిజిటల్​ కార్డులో 30 శాఖలకు సంబంధించిన సమాచారం ఉంటుందని వెల్లడించారు. మహిళలే కుటుంబ పెద్దగా డిజిటల్​ కార్డు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అప్పులు, తప్పులు చేసిందని విమర్శించారు. ఎలివేటెడ్​ కారిడార్​కు అనుమతులు తెచ్చిందే తాను అని గర్వంగా చెప్పారు. అధికారం కోల్పోవడంతో విచక్షణ కోల్పోయి బీఆర్​ఎస్​ నేతలు మాట్లాడుతున్నారన్నారు. అలాగే హైదరాబాద్​ ట్రాఫిక్​, వరదల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. బీఆర్​ఎస్​ ఖాతాల్లో రూ.1,500 కోట్లు ఉన్నాయని, వాటిలో రూ.500 కోట్లు మూసీ పరిధిలోని పేదలకు పంపిణీ చేయాలని వ్యాఖ్యానించారు.

హైడ్రాపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తాం : హైడ్రాపై అసెంబ్లీలో చర్చించామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఆనాడు హైడ్రాపై సూచనలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు 15 వేల ఇళ్ల కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామన్నారు. డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముందని ప్రసంగించారు. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తాం, వచ్చి సలహాలు ఇవ్వండని ప్రతిపక్షాలకు సూచించారు. కేటీఆర్​, హరీశ్​రావు, సబిత కుమారుల ఫామ్​హౌస్​లు కూల్చాలా? వద్దా? చెప్పండని అడిగారు. ఫామ్​హౌస్​లు కూల్చుతారనే పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు, హైదరాబాద్​లో మీ భరతం పడతామని హెచ్చరించారు.

మూసీ వల్ల నల్గొండ ప్రజలు విషాన్ని మింగుతున్నారు : కిషన్​రెడ్డి, ఈటల మీకు ప్రధాని మోదీ చేపట్టిన సబర్మతి రివర్​ ఫ్రంట్​ కావాలి కానీ మూసీ రివర్​ ఫ్రంట్​ వద్దా అంటూ సీఎం రేవంత్​ ప్రశ్నించారు. కిరాయి మనుషులతో కేటీఆర్​, హరీశ్​రావు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న నగరాన్ని కాపాడుకుందామని సూచించారు. కేటీఆర్​, హరీశ్​రావు సచివాలయానికి రండి నాలుగు రోజులు చర్చిద్దామన్నారు. ఈ ప్రభుత్వం పేదల కన్నీళ్లు చూడదలచుకోలేదని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు.

మూసీ నిర్వాసితులకు ఎలా ఆదుకోవాలో సూచనలు ఇవ్వండని అడిగారు. ఈటల రాజేందర్​ మీ నేతృత్వంలోనే నిధుల కోసం మోదీ వద్దకు వెళ్దామన్నారు. కిషన్​రెడ్డి, బండి సంజయ్​ను తీసుకుని రండి రూ.25 వేల కోట్లు ఇప్పించండని సీఎం కోరారు. హైదరాబాద్​ నగరంలో చెరువులు ఆక్రమించిందెవరో తేల్చుదామని సవాల్​ విసిరారు. మూసీ వల్ల నల్గొండ ప్రజలు విషాన్ని మింగుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డులు - త్వరలోనే పైలెట్ ప్రాజెక్ట్​ ప్రారంభం - CM REVANTH REVIEW MEET

మా లక్ష్యం కూల్చివేతలు కాదు, చెరువుల పునరుద్దరణ మాత్రమే- హైడ్రా​ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు - HYDRA Clarity on Musi Demolitions

Last Updated : Oct 3, 2024, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.