ETV Bharat / state

బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth Reddy Meet the Press - CM REVANTH REDDY MEET THE PRESS

CM Revanth Question on PM Modi : బీజేపీకి వచ్చిన రూ.8000 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్​ బాండ్లపై చిత్తశుద్ధి ఉంటే కమిషన్​ వేయాలని సీఎం రేవంత్​ రెడ్డి మోదీని డిమాండ్​ చేశారు. తెలంగాణలో డబుల్​ ఆర్​ టాక్స్​ వసూలు చేసి దిల్లీకి పంపుతున్నారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రంగా స్పందించారు. వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న ఎన్డీఏ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలనలో ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య సమతుల్యత లోపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో జరిగిన మీట్​ ది ప్రెస్​ కార్యక్రమంలో సీఎం రేవంత్​ అనేక అంశాలపై సుదీర్ఘంగా వివరించారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Speak in Meet the Press (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 9:49 AM IST

CM Revanth Reddy Speak in Meet the Press : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్​ రెడ్డి ఎండగట్టారు. గడిచిన 10 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేసిందో చెప్పి, ఓట్లు అడగాల్సిన బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తోందని సీఎం విమర్శించారు. తాజ్ కృష్ణలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలను సమాధానం చెప్పారు.

ఇప్పుడు ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. గతంలో అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో జరిగేవన్నారు. కానీ ఈ ఎన్నికలు బీజేపీకి మాత్రం రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకేనని విమర్శించారు. ఇండియా కూటమికి మాత్రం భారత రాజ్యాంగమే ఖురాన్​, బైబిల్​, భగవద్గీతనని స్పష్టం చేశారు. దేశంలో సంస్థలను, వ్యవస్థలను ఎన్డీయే ప్రభుత్వం చెరబట్టిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలన్నదే కాంగ్రెస్​ విధానమని వివరించారు.

బీజేపీ మతాలు, వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది : తెలంగాణలో కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరించారని సీఎం తెలపగా, రాజకీయ బేరసారాల్లో భాగంగా బీఆర్​ఎస్​ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. మతాలు, వ్యక్తుల మధ్య సమాజంలో బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతుందని ధ్వజమెత్తారు. సమాజం బీజేపీ చేతిలోకి వెళితే నిట్టనిలువుగా చీలిపోతుందని ఆగ్రహించారు. ఓట్ల కోసం మోదీ ప్రజల్లో విద్వేషాలు నింపి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. నియోజకవర్గాల విభజన కత్తి దక్షిణ భారతంపై వేలాడుతుందని జనాభా లెక్కల ఆధారంగా చేస్తే మన ఉనికికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో ఉత్తర, దక్షిణ భారత్​ల మధ్య సమతుల్యత లోపించిందని సీఎం రేవంత్​ ఆరోపించారు.

ఆర్​ఆర్​ టాక్స్​ వర్సెస్​ ఎలక్ట్రోరల్​ బాండ్స్ : బీజేపీకి రూ.8000 కోట్ల ఎలక్ట్రోరల్​ బాండ్​లు ఎలా వచ్చాయని సీఎం రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్​ ఖాతాలు అన్ని సీజ్​ చేయడంతో రైల్​ టికెట్​లు కూడా కొనలేని పరిస్థితిలో కాంగ్రెస్​ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్టోరల్​ బాండ్​లు, పార్టీల ఖర్చు, బీజేపీ చెబుతున్న ఆర్​ఆర్​ టాక్స్​ చిత్తశుద్ధి ఉంటే అన్నింటిపై కమిషన్​ వేయడానికి సిద్ధమా అంటూ సవాల్​ విసిరారు. రాజు నీతిగా ఉంటే చాలదని రాజ్యపాలనలో కూడా నీతివంతంగా ఉండాలని సూచించారు. అవినీతిపరులను పక్కన కూర్చోపెట్టుకుని మోదీ నీతి గురించి మాట్లాడటం దారుణమన్నారు. ఏపీలో కాంగ్రెస్​ పుంజుకోవాలన్నదే తమ విధానమని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో బీజేపీ కమిషన్​ వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

వైఎస్​ రాజశేఖర్​రెడ్డి నిజమైన వారసురాలు ఆయన కుమార్తె షర్మిల అని పార్టీ ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల బరిలో ఆమె నిలబడిందని సీఎం రేవంత్​ రెడ్డి వివరించారు. ఆర్​ఎస్​ఎస్​ రాజకీయ ఎజెండాను అమలు చేయడానికి బీజేపీని ఏర్పాటు చేసిందని, రాజ్యాంగం, రిజర్వేషన్లను మార్చడానికి 400 సీట్లు అవసరమని అడుగుతున్నారన్నారు. రాజ్యాంగం మీద తాను మాట్లాడితే క్రిమినల్​ కేసు పెట్టారని, రాజకీయ కామెంట్స్​ చేస్తే హోం శాఖకు ఏం సంబంధమని గట్టిగా అడిగారు. 200 మంది దిల్లీ పోలీసులు తెలంగాణలో ఉన్నారని సీఎం తెలిపారు.

అప్పటి నుంచే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు : హైదరాబాద్​లో రాజ్యాంగం, రిజర్వేషన్ల మీద తాను మాట్లాడినందుకు మోదీ, అమిత్​ షా తనను లక్ష్యంగా చేసుకున్నారని సీఎం రేవంత్​ ఆరోపించారు. రోజు తప్పించి రోజు వారిద్దరూ తెలంగాణకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీలో 75 ఏళ్లకే రిటైర్మెంట్​ పెట్టి సీనియర్​ నేతలు అద్వానీ, మురళీ మనోహర్​ జోషీలను మోదీ తప్పించారన్నారు. అదానీ, అంబానీలకు మోదీ ఆస్తులు కూడబెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్​ నల్గొండలో తన పట్ల, సీఎం కుర్చీ పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడారన్నారు. అందుకే తాను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై శాసనసభలో చర్చించి తొలగిస్తామని సీఎం చెప్పారు.

27 రోజులు - 57 సభలు - టైమ్​ దొరికితే ఇంటర్వ్యూలు - కాంగ్రెస్​కు అన్నీతానై ప్రచారాన్ని హోరెత్తించిన సీఎం రేవంత్​ రెడ్డి

భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు తీర్పు ఇచ్చినట్లే : రేవంత్ రెడ్డి - CM Revanth Election Campaign

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.