ETV Bharat / state

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ ఉద్దేశం: సీఎం రేవంత్‌రెడ్డి - కొడంగల్​లో​ సీఎం రేవత్ పర్యటన

CM Revanth Reddy Foundation of Kodangal Lift Irrigation : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన ఆయన, నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

CM Revanth Reddy in Kosgi Meeting
CM Revanth Reddy Foundation of Kodangal Lift Irrigation
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 6:49 PM IST

Updated : Feb 21, 2024, 10:17 PM IST

CM Revanth Reddy Foundation of Kodangal Lift Irrigation : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన ఆయన, నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.4,369 కోట్లు విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను(Stalls) పరిశీలించారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఐకేపీ, మహిళా సంఘాల(Women's Groups) ద్వారా పంటల కొనుగోళ్లు జరిపిస్తామని హామీ ఇచ్చారు.

ఇంకా యుద్ధం ముగియలేదు - ఇది విరామం మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Initiates Kodangal Development Programs : మక్తల్, నారాయణపేట, కొండగల్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన కొండగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూ.2,945 కోట్ల అంచనా వ్యయంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే ఆర్​అండ్​బీ అతిథి గృహం, డబుల్ లేన్ రోడ్లు, బ్రిడ్జిలు, గిరిజన సంక్షేమ హాస్టల్ భవనం, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ శాశ్వత భవనం, దౌల్తాబాద్ జూనియర్ కాలేజి, బొమ్రాస్పేట్ జూనియర్ కాలేజీ, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

అలాగే నూతన వెటర్నరీ కళాశాల, ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, మహిళా డిగ్రీ కళాశాల, బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజీ, బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజీ, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరపీ కాలేజీ, 220 పడకల హాస్పిటల్, హెచ్​ఎల్​బీఎస్​, ఆర్​/ఎప్​ ఎస్​, అప్రోచ్ రోడ్ పనులు, 33/11 కేవీ సబ్ స్టేషన్ సహా రూ. 4,369 కోట్ల రూపాయలకుపైగా విలువైన పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

Revanth Reddy Comments on KCR : తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్‌ నుంచి కేసీఆర్‌ ఎంపీగా గెలిచారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కరీంనగర్‌ నుంచి గెలవరనే కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేశారన్న ఆయన, వలస వచ్చిన కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ వచ్చాక పాలమూరుకు ఏమీ చేయలేదని విమర్శించారు. పాలమూరుకు రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్‌(KCR) ఓటు అడగాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

'ప్రపంచంతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం - గత పాలకుల మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం'

రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌రోడ్డు దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా - గడ్కరీతో ఫలించిన సీఎం చర్చలు

Last Updated : Feb 21, 2024, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.