ETV Bharat / state

రాష్ట్రానికి 2.70 లక్షల ఇండ్లు మంజూరు చేయండి - 2,450 ఎకరాల 'రక్షణ' భూములు అప్పగించండి - CM Revanth Reddy Delhi Tour 2024 - CM REVANTH REDDY DELHI TOUR 2024

CM Revanth Reddy Delhi Tour 2024 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో కేంద్రమంత్రుల్ని కలిసి రాష్ట్రానికి అభివృద్ధి నిధులు, వివిద సమస్యల పరిష్కారంపై వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రానికి 2.70 లక్షల పట్టణ ఇళ్ల మంజూరు, స్మార్ట్‌ సిటీ పథకం కాల పరిమితిని పొడిగింపు, హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణకు రక్షణ శాఖ భూముల బదలాయింపుపై వినతిపత్రాలు అందజేశారు.

Revanth Reddy on Telangana Pending Bills
CM Revanth Reddy Delhi Tour 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 7:05 AM IST

CM Revanth Reddy Delhi Tour 2024 Updates : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను కలిశారు. పార్టీ ఎంపీలను వెంటబెట్టుకుని ఇద్దరు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మంత్రులకు సీఎం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ సమస్యల్ని విన్నవించారు. ముందుగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను కలిసి రాష్ట్రానికి 2,70,000 పట్టణ ఇళ్లను బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ విధానం కింద మంజూరు చేయాలని కోరారు. ఇంటి నిర్మాణ వ్యయం నిధులను కూడా పెంచాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

Revanth Reddy on Telangana Pending Bills : పీఎంఏవై- యూ కింద ఇప్పటివరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి రూ.2,390.58 కోట్లు గ్రాంటుగా ప్రకటించారని వీటిలో ఇప్పటివరకు రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని రేవంత్​ రెడ్డి తెలిపారు. మిగతా నిధులనూ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్‌ సిటీ మిషన్‌ కింద వరంగల్‌లో 45 పనులు పూర్తవగా రూ.518 కోట్లతో చేపట్టిన 66 పనులు కొనసాగుతున్నాయని, కరీంనగర్‌లో 25 పనులు పూర్తవగా, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నందువల్ల ఈ ఏడాది జూన్‌ 30తో ముగిసే పథకం కాలపరిమితిని 2025 జూన్‌ వరకు పొడిగించాలని కేంద్రమంత్రిని కోరారు.

రాజ్​నాథ్ సింగ్​తో సీఎం రేవంత్ భేటీ- రక్షణశాఖ భూముల కేటాయింపునకై విజ్ఞప్తి - CM REVANTH DELHI TOUR UPDATES

CM Revanth Meets Union Minister Rajnath Singh : దిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి అనేక సమస్యలపై వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం తదితరాల కోసం రక్షణ శాఖ భూముల అవసరముందని తెలిపారు. రావిర్యాలలో తెలంగాణకు చెందిన 2,462 ఎకరాల భూములను "ఇమారత్‌ పరిశోధన కేంద్రం" ఉపయోగించుకుంటోదని అందుకు ప్రతిఫలంగా 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. వరంగల్‌కు సైనిక్‌ పాఠశాలను మంజూరు చేయాలని సీఎం రక్షణమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

"తెలంగాణ ప్రభుత్వ స్థలాన్ని రక్షణ శాఖకు బదలాయించాం. ఇందుకు బదులుగా రావాల్సిన స్థలాన్ని వారు మాకు ఇవ్వలేదు. ఇందుకోసమే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశాం. అవసరమైన చర్యలు చేపడుతామని వారు హామీ ఇచ్చారు. తెలంగాణలో ఒక్క సైనిక్‌ స్కూలూ లేదు. ఈ విషయంపై పదేళ్లలో కేసీఆర్‌ ఒక్కసారి అడగలేదు. మోదీ ఇవ్వనూలేదు. ఈ విషయంపై రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి విద్యార్థుల కోసం సైనిక్‌ స్కూల్‌ కేటాయించాలని కోరాం. ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు."- రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

Revanth Reddy Delhi Tour Today : మూసీ రివర్‌ ఫ్రంట్‌, మెట్రో రైలు, ప్రధాని ఆవాస్‌ యోజనలో భాగంగా ఇళ్ల కేటాయింపుపై కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించామని రేవంత్​ రెడ్డి తెలిపారు. రెండు మంత్రిత్వ శాఖల వద్ద తెలంగాణ సర్కార్‌రుకు రావాల్సిన పెండింగ్‌ అంశాలన్నింటిపైనా వివరాలు అందజేశామని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్‌లో తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని గుర్తుచేశామన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు ముఖ్యమంత్రి మరికొంతమంది కేంద్ర మంత్రులన కలిసే అవకాశముంది.

నేడు దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్​ రెడ్డి - రెండు రోజుల పాటు అక్కడే మకాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.