CM Revanth Wishes to Union Ministers in Telugu states : కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొలువు దీరింది. ఈ మేరకు ఆదివారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ, కేంద్ర మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఐదుగురు ఉన్నారు. తెలంగాణ తరఫున కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మకు మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ క్రమంలోనే వారికి పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Revanth Congratulates Telugu states Central Ministers : తాజాగా నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం ప్రభుత్వం నుంచి తెలంగాణ, ఏపీకి రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని వారిని ఎక్స్ వేదికగా రేవంత్‌రెడ్డి కోరారు.
కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి : రాష్ట్రం నుంచి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేర్చి అభివృద్ధి కోసం కృషి చేయాలని బీసీ, సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గత తెలంగాణ సర్కార్ కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. ప్రస్తుత కేంద్ర మంత్రులు అన్ని రకాల నిధులు రాబడుతూ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.
ప్రధాని, కేంద్ర మంత్రులకు కేటీఆర్, హరీశ్‌రావు శుభాకాంక్షలు : మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు ఆదివారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని, ఆయన సహచరులు దేశ ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ తమ పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని కేటీఆర్ ఆకాక్షించారు. తాజాగా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు హరీశ్‌రావు విషెస్ చెప్పారు.
కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ బండి సంజయ్ - Bandi Sanjay oath as Union Minister
కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి - KISHAN REDDY oath as Union Minister