ETV Bharat / state

భారీ వర్షాలపై సీఎం రేవంత్‌ అత్యవసర సమీక్ష- అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశం - CM REVANTH EMERGENCY REVIEW - CM REVANTH EMERGENCY REVIEW

CM Revanth Review on Rains : రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలన్నింటికీ సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు తొమ్మిది మంది మరణించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రులు, అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని కోరారు.

HEAVY RAINS IN TELANGANA
CM Revanth Review on Rains (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 12:09 PM IST

Updated : Sep 1, 2024, 7:54 PM IST

CM Revanth Emergency Review : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ ద్వారా మంత్రులు, అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకొని ఆదేశాలు ఇస్తున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటికీ సెలవు ప్రకటించారు. సచివాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలాయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు తెరిచారు.

85 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు పడ్డాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు. వివిధ జిల్లాల్లో 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 2 వేల 500 మందిని తరలించినట్లు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం స్పష్టం చేశారు.

ప్రభుత్వ విభాగాల సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని, ఇప్పటికే ఇచ్చిన వాటిని కూడా రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి పంపించాలని తెలిపారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకి రావొద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం, ఎలాంటి అవసరం ఉన్నా అధికారులకు ఫోన్ చేయాలని చెప్పారు.

మంత్రి భట్టి సమీక్ష : ఖమ్మం నుంచి సమీక్ష నిర్వహించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు కలిగితే, వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని చెప్పారు. ఖమ్మంలో మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన భట్టి సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. విద్యుత్‌ సరఫరాలపై అంతరాయాలకు 1912 కాల్‌ చేయాలని తెలిపారు.

మంత్రి ఉత్తమ్ ఆదేశం : చెరువు కట్టలు తెగిన చోట మరమ్మతులు తక్షణమే చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఏఈల నుండి సీఈల వరకు క్షేత్రస్థాయిలో ఉండాలని, రెవెన్యూ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్అండ్ బీ అధికారులతో ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున, అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.

రెవెన్యూ, పునరావాస శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు తొమ్మిది మంది మరణించారని పొంగులేటి వెల్లడించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, హైడ్రా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా 26 ప్లటూన్ల పోలీసు రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయని డీజీపీ జితేందర్ తెలిపారు.

రాష్ట్రంలో ఇవాళ, రేపు కుండపోత వర్షాలు - 33 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ - telangana weather report

హైదరాబాద్​ పరిసరాల్లో భారీ వర్షం - మూసీ నదికి పోటెత్తిన వరద ప్రవాహం - Heavy Flood Water To Yadadri Musi

Last Updated : Sep 1, 2024, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.